కార్పొరేట్ ముసుగులో మరో భారీ స్కామ్..!!

19:15 - September 8, 2018

ఢిల్లీ : దేశ రాజధాని కేంద్రంగా మరో భారీ స్కామ్ బైటపడింది. ఫ్యూచర్ కేర్ లైఫ్ గ్లోబల్ కంపెనీ భారీ స్కామ్ బైటపడింది. కోట్లాది రూపాల్ని మల్టీ నేషనల్ కంపెనీలు కొల్లగొడుతున్నాయి. అమాయకులను టార్గెట్ చేసుకుంటు మల్టీ నేషనల్ కంపెనీలు కోట్ల రూపాల్ని కొల్లగొడుతున్నాయి. ఈ నేపథ్యంలో రూ.1200ల కోట్ల స్కామ్ కు ఫ్యూచర్ కేర్ లైఫ్ గ్లోబల్ కంపెనీ భారీ స్కామ్ కు పాల్పడింది. ఈ కంపెనీకి చెందిన సీఎండీ రాధే శ్యామ్ తో సహా మరో నిందితుడిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇద్దరే ఇద్దరు వ్యక్తులు తమ అమోఘమైన తెలివితేటలతో రూ.1200ల కోట్లు కొల్లగొట్టారు. వారు చదివింది 7వ తరగతి మాత్రమే. కానీ వారిని దేశ వ్యాప్తంగా దాదాపు 20లక్షల మంది ఖాతాదారులతో బిజినెస్ కొనసాగించారు. కరక్కాయ స్కామ్ మరువక ముందే బయటపడ్డ మరో భారీ స్కామ్. ఒకటి కాదు రెండు కాదు గొలుసుకట్టుగా ఏకంగా 1200 కోట్లు కొళ్ళగొట్టారు. ప్రధాన నిందితులు ఇద్దరిని సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు.

రాధేశ్యామ్, సురేందర్ సింగ్. ఫ్యూచర్ మేకర్ లైఫ్ కేర్ గ్లోబల్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి సీఎండీ, సీఈవోలుగా వుంటు..అత్తెసరు చదువే అయినా సూటు బూటు వేసుకుని జనాన్ని మోసం చేయడంలో మాత్రం వీళ్లు అందెవేసిన చేయిగా మారి మోసాలకు తెరతీసారు. హర్యాణకు చెందిన ఈ ఇద్దరు ఢిల్లీ కేంద్రంగా మార్కెటింగ్ కంపెనీని ఏర్పాటు చేశారు. ఆన్ లైన్ అడ్డాగా మల్టీ లెవల్ మార్కెటింగ్ కి తెరతీశారు. ఇందులో తమ వద్ద ఉన్న ప్రొడక్ట్స్ మార్కెటింగ్ స్కీమ్ లో చేరితే కేవలం 7500 పెట్టుబడితో రెండేళ్ళలో 60,000 లాభం, కమీషన్లు ఇస్తామని నమ్మించారు.

కొన్ని రాష్ట్రాల్లో పత్రికల్లోని క్లాసిఫైడ్స్ లో యాడ్స్ ఇచ్చారు. తమ హెల్త్ ప్రొడక్ట్స్ మార్కెటింగ్ లో పెట్టే రూ.7500 పెట్టుబడిలో 2500 మెంబర్ షిప్ కోసం, మిగిలిన 5000 రూపాయలకు మెడిసిన్స్, బట్టలు డెలివరీ చేసేవాళ్ళు. దీంతోపాటు చైన్ సిస్టమ్ లో ఎంతమంది మెంబర్స్ ను చేర్పిస్తే వాళ్ళ టార్గెట్లను బట్టి పది లెవెల్స్ లో కమీషన్లు 5000ల నుండి కోటి రూపాయల వరకు ఫిక్స్ చేశారు. దేశ వ్యాప్తంగా 20 లక్షలకు పైగా మెంబర్స్ ని తన మల్టీ లెవల్ మార్కెటింగ్ ఉచ్చులోకి లాగారు.

ఢిల్లీ కేంద్రంగా కొనసాగుతున్న ఈ స్కామ్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తో పాటు హర్యాణ, ఢిల్లీ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిశాలలో కూడా సాగిన ఈ గొలుసుకట్టు దందాలో బాధితులంతా.. నిరుద్యోగ యువత, రిటైర్డ్ ఉద్యోగులు, గృహిణులే. హై లెవల్లో దేశవ్యాప్తంగా జరిగిన ఈ మల్టీ లెవల్ మార్కెటింగ్ స్కామ్ లో పక్కా స్కెచ్ వేసి 1200 కోట్లు దోచేశారు. ఐతే, కూకట్ పల్లిలోని ఓ బాధితురాలి ఫిర్యాదుతో సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేయగా… ఆర్ధిక నేరాల నియంత్రణ కోసం ఏర్పాటు చేసిన ఎకనామిక్స్ ఆఫెన్సెస్ వింగ్ కేసును దర్యాప్తు చేసింది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన రాధే శ్యామ్ తో పాటు సురేందర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. ఐదు బ్యాంకుల్లోని రూ.200 కోట్లను సీజ్ చేశారు. ఈ కేసులో మరో నిందితుడు పరారీలో ఉండడంతో పూర్తి ఆధారాలతో ఆర్ధిక నేరాన్ని నిరూపించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

Don't Miss