దగ్గుబాటి సురేష్ థియటర్ దగ్ధం..

13:15 - August 10, 2017

ప్రకాశం : దగ్గుబాటి రామానాయుడుకు చెందిన థియేటర్ లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ థియేటర్ లో 'దగ్గుబాటి రానా' నటించిన 'నేనే రాజు నేనే మంత్రి' సినిమా శుక్రవారం విడుదల కావాల్సి ఉంది. ప్రమాదం జరగడంతో అభిమానులు తీవ్ర నిరాశకు లోనయ్యారు. ప్రమాదం వార్త తెలుసుకున్న దగ్గుబాటి సురేష్ హైదరాబాద్ నుండి చీరాలకు బయలుదేరినట్లు తెలుస్తోంది.

చీరాలా పట్టణంలో సురేష్ మహల్ ఏసీ థియేటర్ కొన్నేళ్లుగా ఉంది. ఈ మధ్యే థియేటర్ ను పునర్ నిర్మించారు. అనంతరం శుక్రవారం 'రానా' నటించిన సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో థియేటర్ ను అందంగా అలంకరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కానీ ఒక్కసారిగా ఏసీ పైపుల్లో షార్ట్ సర్క్యూట్ కావడం..పెద్ద ఎత్తున మంటలు చెలరేగడం జరిగిపోయాయి. దీనితో ఆ ప్రాంతంలో భయాందోళనలు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. థియేటర్ లో ఫర్నీచర్..ఇతరత్రా మొత్తం అగ్నికి ఆహుతై పోయింది. రూ. 2 కోట్ల ఆస్తి నష్టం జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. 

Don't Miss