మక్కా మసీదు పేలుళ్లు..నిర్దోషులు...

12:12 - April 16, 2018

హైదరాబాద్ : మక్కా మసీదు పేలుళ్లు..11 ఏళ్ల తరువాత తీర్పు వచ్చేసింది. సోమవారం నాంపల్లి ఎన్ఐఏ కోర్టు తుది విచారణ జరిపింది. కేసును కోర్టు కొట్టివేసింది. ఐదుగురు నిందితులు నిర్దోషులుగా ప్రకటించేసింది. దీనితో ఏ 1 దేవేందర్ గుప్తా, ఏ 2 లోకేశ్ శర్మ, ఏ 6 స్వామి ఆసీమనందా, ఏ7 భరత్ భాయ్, ఏ 8 రాజేందర్ లు విడుదల కానున్నారు. సందీప్ డాంగే, రామచంద్ర కళా సంగ్రా, అమిత్ చౌహాన్ లు పరారీలో ఉన్నారు. ఆధారాలు నిరూపించడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందని కోర్టు పేర్కొంటూ నిందితుందరినీ నిర్దోషులుగా ప్రకటించింది. కోర్టు వద్ద మీడియాను అనుమతించలేదు.

మక్కా మసీదులో ప్రార్థనల సమయంలో... 2007 మే 18న పేలుళ్లు జరిగిన సంగతి తెలిసిందే. ఆనాటి ఘటనలో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. పేలుళ్ల తర్వాత పాతబస్తీలో చెలరేగిన అల్లర్లను అదుపు చేసేందుకు పోలీసులు జరిపిన కాల్పుల్లో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ రెండు ఘటనల్లో 58 మంది గాయపడ్డారు. చికిత్స పొందుతూ వీరిలో కొందరు ప్రాణాలు కోల్పోయారు. అప్పట్లో ఈ కేసు దర్యాప్తును ఎన్‌ఐయే ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. 

Don't Miss