నిద్ర పోతే ప్రాణం పోతుంది..

11:53 - July 21, 2017

నిద్ర..మనిషికి ఎంతో ముఖ్యం..ఆలోచనలు..కష్టాలు మరిచిపోతూ నిద్ర పోతుంటారు. ఆరు గంటల నిద్ర అవసరమని వైద్యులు సూచిస్తుంటారు. నిద్రలేమి కారణంగా ఎన్నో ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయని వైద్యులు సూచిస్తుంటారు. ప్రపంచంలో ఏ మనిషి అయినా నిద్ర పోవాల్సిందే. నిద్ర ఎవరికైనా ప్రశాంతతను అందిస్తుంది. కానీ ఓ వ్యక్తి మాత్రం నిద్ర పోతే చనిపోతాడంట. ఓ అరుదైన వ్యాధితో బాధ పడుతున్న వ్యక్తికి సంబంధించిన వార్త సోషల్ మాధ్యమాల్లో వైరల్ అవుతోంది...

లియామ్ డెర్బీషైర్ అనే యువకుడు బ్రిటన్ కు చెందిన వాడు. ఇతనికి 'సెంట్రల్ హైపోవెంటిలేషన్' అనే అరుదైన వ్యాధితో బాద పడుతున్నాడు. ఈ వ్యాధి ఉన్న వారు పొరపాటున నిద్రపోతే ప్రాణం పోతుంది. ఇంత తీవ్రమైన వ్యాధి అతని పుట్టుక నుండే వచ్చిందని తెలుస్తోంది. లియామ్ బతికే ఛాన్స్ లేదని..ఆరు వారాలకు మించి ఉండడని వైద్యులు తేల్చిచెప్పారు. తమ కుమారుడిని బతికించుకోవాలనే ఉద్ధేశ్యంతో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

లియామ్ నిద్రపోతే అతని ఊపిరితిత్తులు ఆగిపోకుండా చూడాలి. నిద్రపోయిన అనంతరం ఎవరి ఊపిరితిత్తులు కూడా విశ్రాంతి తీసుకుంటాయనే సంగతి తెలిసిందే. లియామ్ ఊపిరితిత్తులు ఆగిపోకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఓ ప్రత్యేకమైన బెడ్ రూం ఏర్పాటు చేశారు. లియామ్ నిద్రలోకి జారుకోగానే కృతిమ శ్వాసను అందేలా ఏర్పాటు చేశారు. గుండె ద్వారా ఊపిరితిత్తులకు తగిన ఆక్సిజన్ అందేలా చేశారు.

ఈ పర్యవేక్షణ కోసం ఒకరిని నియమించారు. బెడ్ రూంలో జరిగే అంశాన్ని సమన్వయంతో వారు పరిశీలిస్తునే ఉన్నారు. ఇలా గత పద్దెనిమిదేళ్లుగా కంటి రెప్పలా కాపాడుకుంటున్నారు. ఎలాంటి సమస్య లేకుండా లియామ్ బతికేస్తూ మృత్యువును ఓడిస్తూనే ఉన్నాడు...

Don't Miss