మీ ''థంబ్ నెయిల్స్'' కోసం నన్ను వాడుకుంటారా?..

14:32 - June 28, 2018

మెగా ఫ్యామిలి నుండి వచ్చిన ఒకే ఒక్క మోగా హీరోయిన్ నిహారిక. యాంకర్ గా,హీరోయిన్ గా అలరిస్తున్న నిహారిక తన పెళ్లి మాత ఎత్తితే చాలు మండి పడిపోతోంది. యూత్ లో నిహారికకు విపరీతమైన ఫాలోయింగ్ వున్న ఈ మెగా హీరోయిన్ సినిమా కోసం ఎంతో కుతూహలంగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో నిహారిక తాజా చిత్రంగా 'హ్యాపీ వెడ్డింగ్' సిద్ధమయిపోయింది. సుమంత్ అశ్విన్ జోడీగా ఆమె నటించిన ఈ సినిమాకి లక్ష్మణ్ కార్య దర్శకత్వం వహించాడు. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషనల్ వీడియోను కొత్త కాన్సెప్ట్ తో రిలీజ్ చేశారు.

నా పెళ్లి గురించి మీకెందుకయ్యా అంటోంది మెగా హీరోయిన్
షూటింగ్ ముగించుకుని బయల్దేరుతోన్న నిహారిక దగ్గరికి ఒక వ్యక్తి వస్తాడు. తాను ఓ యూ ట్యూబ్ ఛానల్ నుంచి వచ్చినట్టు చెప్పి .. 'సోషల్ మీడియాలో మీ వెడ్డింగ్ విషయం బాగా వైరల్ అవుతోంది .. దాని గురించి చెబుతారా?' అని అడుగుతాడు. దాంతో .. "నా పెళ్లి గురించి మీకెందుకయ్యా .. ఎవరిని చేసుకుంటుంది .. ఎప్పుడు చేసుకుంటుంది .. చూస్తే షాక్ అవుతారు .. షేక్ అవుతారు అంటూ రాస్తారు. మీ థంబ్ నెయిల్స్ కోసం నన్ను వాడుకుంటారా?" అంటూ కోపాన్ని ప్రదర్శిస్తుంది. తాను అడిగేది 'హ్యాపీ వెడ్డింగ్' మూవీ గురించి అని ఆ వ్యక్తి అనడంతో వెంటనే శాంతించింది. వెంటనే సారీ, సారీ 'హ్యాపీ వెడ్డింగ్' ట్రైలర్ ఈ నెల 30 వ తేదీన రిలీజ్ అవుతుంది. ఆ రోజునే సినిమా రిలీజ్ ఎప్పుడనేది చెబుతాను బాయ్ అంటూ వెళ్లి పోతుంది'. కాగా గురువారం దుయం 10గంటల 35 నిమిషాలకి ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. 

Don't Miss