మెఘా మెయిల్... అరుదైన ఘనత

13:10 - February 9, 2018

హైదరాబాద్ : మెఘా ఇంజినీరింగ్‌ ఇన్‌ఫ్ట్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌... మెయిల్‌ సంస్థ.. అరుదైన ఘనతను సాధించింది. ఉత్తర ప్రదేశ్‌లో తాజాగా ఆవిష్కరించిన భారీ పవర్‌ ట్రాన్స్‌మిషన్‌ ప్రాజెక్టుకు.. దేశంలోనే తొలిసారిగా.. జీఐఎస్‌ టెక్నాలజీని వినియోగించడం ద్వారా ఈ ఘనతను సాధించింది. 

హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేసే.. మెఘా ఇంజనీరింగ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌.. మెయిల్‌.. విజయ పరంపరలో సరికొత్త రికార్డును సొంతం చేసుకుంది. తాము చేపట్టిన అత్యంత ప్రతిష్ఠాత్మకం.. దేశంలోనే అతి పెద్దదీ అయిన.. వెస్టర్న్‌ ఉత్తరప్రదేశ్‌ పవర్‌ ట్రాన్స్‌మిషన్‌ కంపెనీ లిమిటెడ్‌ ప్రాజెక్టును నిర్ణీత కాలావధిలోనే పూర్తి చేసి.. జాతికి అంకితం చేసింది. 

ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్రంలో వెలుగులు పంచేందుకు.. 13,220 ఎంవీయే సరఫరా సామర్థ్యంతో నిర్మించిన ఈ ప్రాజెక్టును నాలుగు వేల నూట యాభై కోట్ల రూపాయల వ్యయంతో పూర్తి చేశారు. 2011లో శ్రీకారం చుట్టిన ఈ ప్రాజెక్టును, అత్యాధునిక సాంకేతిక నైపుణ్యాన్ని వినియోగించి, నిర్దిష్టమైన ప్రణాళిక ప్రకారం పూర్తి చేసి, బుధవారం జాతికి అంకితం చేశారు. ఈ ప్రాజెక్టులో దేశంలోనే తొలిసారిగా జీఐఎస్‌ టెక్నాలజీని వినియోగించారు. 

ఉత్తర ప్రదేశ్‌ పశ్చిమ ప్రాంతంలో గతంలోని ట్రాన్స్‌మిషన్‌ నెట్‌వర్క్‌ అస్తవ్యస్త నిర్వహణ కారణంగా.. విద్యుత్‌ సరఫరాలో తీవ్ర అంతరాయాలు.. అది కూడా గంటల తరబడీ విద్యుత్‌ కోతలూ ఉండేవి. మెయిల్‌ సంస్థ నిర్మించిన ఈ ప్రాజెక్టు వల్ల ఈ ప్రాంతంలోని విద్యుత్‌ సమస్యలన్నీ తొలగినట్లే. గతంలో ఇంత భారీ ప్రాజెక్టులు పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలోనే ఉండేవి. దేశంలోనే తొలిసారిగా.. ఈ డబ్ల్యుయూపీపీటీసీఎల్ ప్రాజెక్టు పూర్తిగా ప్రైవేటు నిర్వహణలో ఉండబోతోంది. వచ్చే 35 సంవత్సరాల పాటు.. మెయిల్‌ సంస్థ.. ఈ పవర్‌ ట్రాన్స్‌మిషన్‌ ప్రాజెక్టు నిర్వహణ బాధ్యతను చేపడుతుంది. 

మెయిల్‌ సంస్థ నిర్మించిన డబ్ల్యుయూపీపీటీసీఎల్ ప్రాజెక్టులో.. ప్రకృతి వైపరీత్యాల సమయంలో.. అత్యల్ప వ్యయంతో.. కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే విద్యుత్‌ పునరుద్ధరణ చేపట్టేలా ఏర్పాట్లూ చేశారు. 

Don't Miss