'రంగస్థలం'లో 'సైరా'..రెజ్లర్ గా రానా..

16:27 - May 17, 2018

'రంగస్థలం' సినిమా రామ్ చరణ్ సినీ కెరీర్ లో చాలా ప్రత్యేకంగా నిలిచిపోతుంది. ఈ సినిమా హిట్ అనంతరం రామ్ చరణ్ చాలా చాలా సంతోషంగా కనిపిస్తున్నాడు. రంగస్థలం సినిమాలో చాలా ప్రత్యేకతలున్నాయి. పాటలు,చరణ్ నటనతో పాటు రంగస్థలం గ్రామం సెట్టింగ్ ముఖ్యంగా చెప్పుకోవాల్సినది. 'రంగస్థలం' సినిమా కోసం హైదరాబాదులో వేసిన విలేజ్ సెట్లో ఇప్పుడు చిరంజీవి నటిస్తున్న 'సైరా' చిత్రం షూటింగ్ చేస్తున్నారు. అక్కడి బంగ్లా సెట్లో చిరంజీవి, తమన్నా తదితరులు పాల్గొనే సీన్స్ ను చిత్రీకరిస్తున్నారు.

రెజ్లర్ గా రానా..
రానా దగ్గుబాటి త్వరలో రెజ్లర్ గా నటించనున్నాడు. ప్రముఖ మల్లయుద్ధ వీరుడు కోడి రామ్మూర్తి బయోపిక్ గా రూపొందే చిత్రంలో ఆయన పాత్రను పోషించడానికి రానా ఓకే చెప్పినట్టు సమాచారం.

యోధుడిగా కోడి రామ్ముర్తి చరిత్ర..
తెలుగు దేశంలో ప్రఖ్యాత తెలగ వీర యోధ వంశాలలో కోడి వారి వంశం ఒకటి, ఈ వంశ పరంపరలోని శ్రీ కోడి వెంకన్న నాయుడు కోడి రామ్ముర్తి తండ్రి. 1882లో పుట్టిన కోడి రామ్ముర్తి చిన్నతనంలోనే తల్లిని కోల్పోయి, తండ్రి ప్రేరణతో విజయనగరంలో తన పినతండ్రి కోడి నారాయణస్వామి దగ్గర పెరిగారు కోడి రామ్ముర్తి. అక్కడ ఒక వ్యాయామశాలలో చేరి దేహ ధారుడ్యాన్ని పెంచుకోవడంతో పాటు కుస్తీ కూడా నేర్చుకున్నారు. 21 సంవత్సరాల వయసులోనే ఇతడు ఛాతిపై 1 1/2 టన్నుల భారాన్ని మోసేవాడు. తరువాత 3 టన్నుల భారాన్ని కూడా మోయగలిగేవాడటం కోడి రామ్ముర్తి. మద్రాసులో సైదాపేట కాలేజిలో ఒక సంవత్సరం వ్యాయామశాలలో శిక్షణ తీసుకుని విజయనగరానికి తిరిగి వచ్చి విజయనగరం శిక్షణ తర్వాత వ్యాయామోపాధ్యాయుడుగా సర్టిఫికేట్ అందుకుని, విజయనగరంలో తాను చదివిన హైస్కూలులో వ్యాయామ శిక్షకుడుగా చేరాడు.

రామ్ముర్తి ప్రదర్శనలకు విశేష స్పందన..
శరీరానికి కట్టిన ఉక్కు గొలుసును కట్టించుకుని ముక్కలుగా తుంచి వేసేంత దేహధారుడ్యం అతని సొంతం. రెండు కార్లను రెండు భుజాలకు ఇనుప గొలుసులతో కట్టించుకుని స్వీడ్ నడిపినాగానీ కార్లను మాత్రం ఏమాత్రం కదలనీయని యోధుడు కోడి రామ్ముర్తి, ఛాతీ పై పెద్ద ఏనుగును ఎక్కించుకునేవాడు. 5 నిమిషాల పాటు, రొమ్ముపై ఏనుగును అలాగే ఉంచుకునేవాడు. తండోపతండాలుగా ప్రజలు వారి ప్రదర్శనలు చూచేవారు. అటువంటి మల్లయోధుడి కథలో దగ్గుపాటి రానా నటించనున్నట్లుగా సినీ పరిశ్రమ సమాచారం. 

Don't Miss