మానసిక ఆరోగ్యమే శారీరక ఆరోగ్యం..

14:50 - January 20, 2017

మానసికంగా ఎంత ఆరోగ్యంగా ఉంటేనే అంత శారీరకంగా ఆరోగ్యంగా ఉంటారు. ఎప్పుడైతే మానసిక ఆందోళన మొదలవుతుందో అప్పటి నుండే అనేక సమస్యలు వస్తుంటాయి. వీటిని సైకోస్మోటిక్ డిజార్డర్స్ అంటారు. కొన్ని శ్వాస సంబంధిత వ్యాధులు కూడా దీనికి కిందకే వస్తాయి. నిత్యం మనం ఎదుర్కొనే టెన్షన్ నుండి గట్టెక్కాలంటే మానసిక ప్రశాంత అవసరం. ఈ ప్రశాంత మందులు షాప్ లో దొరకవు..డబ్బులతో కొనేది కాదు. విపరీతమైన కోపం ఉండడం వల్ల పలు సమస్యలు ఎదురవుతుంటాయి. కోపం..ఒంటరితనం, ఒత్తిడి వంటివి కొన్నిసార్లు తలనొప్పి, ఒళ్ళు నొప్పులు, నిద్రలేమి..కడుపునొప్పికి కారణమౌతాయి. కొన్ని నమ్మకాలు..నెగటివ్ ఆలోచనలు, భావోద్వేగాలు ఈ నొప్పులకు కారణమౌతాయి.
ఇలాంటి సమస్యలు వచ్చిన సమయంలో మందుల జోలికి వెళ్లకుండా అందుకు కారణం ఏంటనీ ప్రశాంతంగా ఆలోచించాలి. ప్రత్యామ్నాయ మార్గాలు ఆలోచించాలి. యోగా..మెడిటేషన్ వంటివి చేస్తే ఫలితాలు కనబడుతాయి. మానసిక ప్రశాంతతనే కాకుండా శారీరకంగా ఫిట్ నెస్ ను పెంచుతుంది. యోగా చేయడం వల్ల రక్త ప్రసరణ మెరుగవుతుంది. శరీరం నుండి వ్యర్ధాలు బయటికి నెట్టబడతాయి. చర్మం కాంతివంతం అవుతుంది. బ్రెయిన్ పవర్ పెరుగుతుంది. మెదడు , గుండె , ఊపిరితిత్తులు , కాలేయం , కిడ్నీలు , ఇంకా అంతర్గత అవయవాల్లో రక్త ప్రసరణ మెరుగుపడి అవయవాలు సక్రమంగా పని చేస్తాయి.

Don't Miss