పెద్దపల్లి రైతాంగం తీవ్ర ఆగ్రహం...

09:24 - January 17, 2018

కరీంనగర్ : పెద్దపల్లి జిల్లాలోని ఎస్ఆర్ ఎస్పీ నీటి కోసం రైతులు ఆందోళనను ఉధృతం చేస్తున్నారు. డీ 83, డీ 86 కెనాళ్లకు నీటిని విడుదల చేయాలని రైతులు కోరుతున్నారు. ఎస్ఆర్ ఎస్ పి నీటిని కాకతీయ కెనాల్ ద్వారా తన నియోజకవర్గానికి మంత్రి ఈటెల విడుదల చేయడంతో వివాదం ప్రారంభమైంది. మంత్రి ఈటెల చర్యను రైతులు తీవ్రంగా మండిపడుతున్నారు. తమ తమ నియోజకవర్గాలకు నీటిని విడుదల చేశారని..ఇతర నియోజకవర్గాలకు నీటిని విడుదల చేయకపోవడం పట్ల వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నీటిన విడుదల చేయాలంటూ మూడు రోజుల క్రితం ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిని కూడా పెద్దపల్లి రైతులు అడ్డుకున్నారు. ఈ విషయంలో నీటి పారుదల శాఖ మంత్రితో ఎమ్మెల్యే వాదనకు దిగినట్లు సమాచారం. కానీ ప్రజాప్రతినిధుల వత్తిడితో నీటిని ఆయా నియోజకవర్గాలకు విడుదల చేసినట్లు ప్రచారం జరుగుతోంది. దీనితో బుధవారం మాజీ ఎమ్మెల్యే విజయ రమణ ఆధ్వర్యంలో రైతులు ఆందోళనకు శ్రీకారం చుట్టారు. దీనితో పోలీసులు ముందస్తు అరెస్టుకు రంగం సిద్ధం చేస్తున్నారు. విజయ రమణను గృహ నిర్భందం చేసేందుకు పోలీసులు యత్నిస్తున్నారు. 

Don't Miss