కాళేశ్వరం ప్రాజెక్టు పనుల పురోగతిపై సమీక్ష

07:03 - January 10, 2017

హైదరాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని తెలంగాణ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. అక్టోబర్‌కల్లా  నీరు ఇచ్చేలా అధికారులంతా కృషి చేయాలన్నారు. బ్యారేజీలు, పంప్‌హౌజ్‌లకు చెందిన డిజైన్‌లను టాప్‌ ప్రయార్టీగా సమర్పించాలని ఆదేశించారు.  జలసౌధలో  కాళేశ్వరం ప్రాజెక్టు  పనుల పురోగతిపై ఆయన సమీక్షించారు. ఈ ప్రాజెక్టును సవాల్‌గా తీసుకుని.. వీలైనంత త్వరగా పూర్తి చేసి ఆసియాలోనే సరికొత్త రికార్డు సృష్టించాలని సూచించారు. కాలేశ్వరంతోపాటు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీపైనా హరీశ్‌ సమీక్షించారు.

 

Don't Miss