ముస్లీంల శ్రేయస్సు కోసం ఆలోచించే ప్రభుత్వం మాదే : మంత్రి హరీష్‌రావు

07:39 - June 1, 2018

సిద్ధిపేట : టీఆర్‌ఎస్‌ ముస్లీంల శ్రేయస్సు కోసం ఆలోచించే ప్రభుత్వం అన్నారు మంత్రి హరీష్‌ రావు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కొండభూదేవి గార్డెన్‌లో రంజాన్‌ పండగ సందర్భంగా ఉచిత సరకుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. ముస్లీం మహిళలకోసం షాదీ ముబారక్‌ పథకం ద్వారా  లక్షరూపాయలు కేసీఆర్‌ ప్రభుత్వం ఇస్తోందని మంత్రి అన్నారు. సిద్దిపేటలో రెండు మైనారిటీ కళాశాలలతోపాటు.. ముస్లీంలకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నామని చెప్పారు. 

 

Don't Miss