వారి సస్పెన్షన్‌, అనర్హత వేటు సరైనదే : జగదీష్‌రెడ్డి

17:28 - March 13, 2018

హైదరాబాద్ : కాంగ్రెస్‌ సభ్యుల సస్పెన్షన్‌, ఇద్దరు సభ్యులపై అనర్హత వేటు సరైనదేనని రాష్ట్ర మంత్రి జగదీష్‌రెడ్డి అన్నారు. దాడి చేసిన సభ్యులపై క్రిమినల్‌ చర్యలు చేపట్టే అధికారం స్పీకర్‌కు ఉంటుందని ఆయన మీడియాపాయింట్‌లో తెలిపారు. కాంగ్రెస్‌ ముఠాకు నాయకత్వం వహించింది జానారెడ్డి అని అందుకే ఆయనపై వేటు పడిందన్నారు. దాడి చేసి టెర్రరిస్టులు ఆనందపడ్డట్లు కాంగ్రెస్‌ సభ్యులు ఆనందపడ్డారని జగదీష్‌రెడ్డి విమర్శించారు.

 

Don't Miss