ఎంత ఉపాధి కల్పించామన్నదే ముఖ్యం : మంత్రి కేటీఆర్

11:28 - August 10, 2018

హైదరాబాద్ : గత నాలుగేళ్లలో తెలంగాణలో ఎంతో అభివృద్ధి సాధించామన్నారు మంత్రి కేటీఆర్‌. హైదరాబాద్‌లోని పార్క్ హయత్‌లో ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు. దేశంలో ఎన్ని కంపెనీలు ఉన్నాయన్నది ముఖ్యం కాదని.. ఎంత ఉపాధి కల్పించామన్నదే ముఖ్యమని కేటీఆర్ అన్నారు. హైదరాబాద్‌లో పెట్టుబడులకు అద్భుతమైన అవకాశాలు ఉన్నాయని తెలిపారు. రాష్ర్టాభివృద్ధి కోసం ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్‌తో కలిసి పని చేస్తామని చెప్పారు. రాష్ట్రం ఏర్పడిన ఆరు నెలల్లోనే విద్యుత్ సమస్యను అధిగమించామని.. సోలార్ విద్యుత్ ఉత్పత్తిలో రాష్ట్రం దేశంలో రెండో స్థానంలో ఉందన్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కోసం సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని కేటీఆర్ స్పష్టం చేశారు. టీఎస్ ఐపాస్‌తో రాష్ర్టానికి పెట్టుబడులు తరలి వచ్చాయని తెలిపారు.  

 

Don't Miss