ఒక రాష్ట్రానికి ఆస్తులు, మరో రాష్ట్రానికి అప్పులు : నారా లోకేశ్‌

16:45 - September 12, 2017

విశాఖ : విశాఖపట్టణం, పెందుర్తిలో మంత్రి నారా లోకేశ్‌ పర్యటించారు. పర్యటనలో భాగంగా సమాఖ్య భవనం, షాపింగ్‌ కాంప్లెక్స్‌ను మంత్రి ప్రారంభించారు. అనంతరం డ్వాక్రా మహిళలతో సమావేశమయ్యారు. అప్పులు ఒక రాష్ట్రానికి, ఆస్తులు ఒక రాష్ట్రానికి ఇచ్చారని మంత్రి లోకేశ్‌ అన్నారు. 16 వేల కోట్ల లోటు బడ్జెట్ ఉన్నా.. సీఎం ప్రజలకు లోటు లేకుండా పరిపాలన చేస్తున్నారన్నారు. డ్వాక్రా సంఘాలను మరింత మలోపేతం చేసి మహిళల కాలికి మట్టి అంటకుండా.. అన్ని గ్రామాల్లో సిమెంట్‌ రోడ్లు నిర్మిస్తున్నామని లోకేశ్ తెలిపారు. 

 

Don't Miss