58 లక్షల మందికి పెన్షన్లు అందిస్తున్నాం : మంత్రి లోకేశ్‌

07:18 - June 14, 2018

గుంటూరు : గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చామన్నారు మంత్రి నారాలోకేష్‌. రాష్ట్రంలో 58 లక్షల మందికి  పెన్షన్లను ఇస్తున్నామన్నారు. రాష్ట్ర విభజన వల్ల అప్పులపాలైనా రాష్ట్రాన్ని సీఎం చంద్రబాబు అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని లోకేశ్‌ అన్నారు. అనంతపురం జిల్లా మడకశిరలో జరిగిన టీడీపీ సభలో ఆయన మాట్లాడారు. దాదాపు 25వేల కోట్లతో రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ముఖ్యంత్రి అమలు చేస్తున్నారని లోకేశ్‌ తెలిపారు. 

 

Don't Miss