కేటీఆర్ కృషి వల్లే సిరిసిల్లకు పాలిటెక్నిక్, అగ్రికల్చర్ కాలేజీలు : మంత్రి పోచారం

14:02 - June 13, 2018

రాజన్నసిరిసిల్ల : మంత్రి కేటీఆర్ కృషి వల్లే సిరిసిల్లకు పాలిటెక్నిక్, అగ్రికల్చర్ కాలేజీలు వచ్చాయని మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు.   
వ్యవసాయ కళాశాల శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఇది ఒక చక్కటి కార్యక్రమం అన్నారు. కేటీఆర్ కృషి వల్ల పాలిటెక్నిక్ కళాశాలను బిల్డింగ్ తో సహా ప్రారంభించుకున్నామని తెలిపారు. ఒక్క సిరిసిల్లకు పాలిటెక్నిక్ కళాశాల, వ్యవసాయ కళాశాల వచ్చాయని..అది కేటీఆర్ చొరవ వల్లే అని పేర్కొన్నారు. బోధించే సిబ్బందితో ప్రారంభించామని తెలిపారు. ఈ ఏడాది నుంచే అడ్మిషన్లు ప్రారంభం అవుతాయని చెప్పారు. 60 మంది విద్యార్థులతో కాలేజీ ప్రారంభం చేయాలని వీసీ ప్రవీణ్ రావుకు సూచించారు. 

 

Don't Miss