మోది ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్‌ దుష్ప్రచారం : రాజ్ నాథ్ సింగ్

22:18 - November 7, 2017

ఢిల్లీ : ఆర్థిక వ్యవస్థ దిగజారిందని మోది ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్‌ దుష్ప్రచారం చేస్తోందని హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ అన్నారు. యూపీఏ పాలనలో ధరల పెరుగుదల సూచికలో రెండింతలు పెరిగిందని గుర్తు చేశారు. ఓ దశలో జిడిపి గ్రోత్‌రేట్‌ కన్నా ద్రవ్యోల్బణం అధికంగా ఉందని రాజ్‌నాథ్‌సింగ్ ఎద్దేవా చేశారు. ఆర్థిక వ్యవస్థ దృఢంగా లేకుంటే విదేశీ పెట్టుబడులు ఎలా పెరుగుతున్నాయని ప్రశ్నించారు. ఎన్డీయే ప్రభుత్వం సాధించిన విజయాలను విపక్షాలు ఓర్వలేకపోతున్నాయని రాజ్‌నాథ్‌ అన్నారు.

 

Don't Miss