ఖమ్మం నగరానికి మణిహారంగా లకారం పార్కు : మంత్రి తుమ్మల

07:16 - February 11, 2018

ఖమ్మం: మురికి కూపంగా ఉన్న లకారం చెరువును ఖమ్మం నగరానికి మణిహారంగా తయారు చేశామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. లకారం ట్యాంక్‌బండ్‌ అభివృద్ధికి సహకరించిన ప్రతి ఒక్కరికీ మంత్రి ధన్యవాదాలు తెలిపారు.  మంత్రి  ఎలక్ట్రిక్‌ కారులో తిరుగుతూ పార్కును పరిశీలించిన అనంతరం బోట్‌లో షికారు చేశారు. ఈ పార్కుకోసం ఇప్పటికే 24 కోట్ల నిధులు ఇచ్చామని... కావాలంటే మరో రెండు కోట్లు ఇవ్వడానికైనా సిద్ధంగా ఉన్నామని తెలిపారు. 

 

Don't Miss