ఆ మూడింటిని తిప్పికొట్టాలన్న యనమల...

16:45 - July 12, 2018

విజయవాడ : టిడిపిపై, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిపై తప్పుడు ప్రచారం జరుగుతోందని..బీజేపీ, వైసీపీ, జనసేన పార్టీల తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలని ఏపీ ఆర్థిక మంత్రి యనమల పిలుపునిచ్చారు. టిడిపి విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. వివిధ శాఖల్లో ఉన్న ఖాళీలను రిక్రూట్ మెంట్ చేయడం జరుగుతోందని, 40వేల పోస్టులు భర్తీకి శ్రీకారం చుడుతోందన్నారు. యూత్ కు అలవెన్స్ ఇవ్వాలని బాబు లక్ష్యంగా పెట్టుకున్నట్లు, మేనిఫెస్టోలో పేర్కొన్న వాటినే కాక ఇతరుల హామీలు కూడా చేయడం జరిగిందన్నారు. పట్టిసీమ, పురుషోత్తపట్నం కొన్ని అంశాలు మొదలు అనుకోలేదని..తరువాత వచ్చాయన్నారు. తప్పుడు ప్రచారం చేయడానికి కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని..దీని ద్వారా మనుగడ ఉంటుందని బీజేపీ ఆలోచన అన్నారు. బీజేపీ..జనసేన..జగన్ ను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. వీరికి సరియైన విధంగా బుద్ధి చెప్పాలంటే ప్రజల మధ్య వెళ్లి ప్రచారం చేయాలని సూచించారు.

1951లో రాజ్యంగం వచ్చిన అనంతరం ఒకే ఎన్నిక జరిగిందని, అనంతరం ఎన్నికలు విడిపోయాయన్నారు. ఒకే సారి ఎన్నికలు సాధ్యమైనా ? అని ఆలోచించకుండా ప్రాంతీయ పార్టీలు..ప్రాంతీయ నేతలు పైకి వస్తున్నారనే ఆలోచనతో..ప్రాంతీయ పార్టీలను అణిచివేయాలనే ఉద్దేశ్యంతో ఒక ఏజెండాను దేశపై రుద్దాలని ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. ప్రాంతీయ పార్టీలు బతకాలనే ఉద్దేశ్యం బీజేపీకి లేదని..రాజకీయ దురుద్ధేశ్యంతో చేస్తున్న ప్రయత్నాన్ని టిడిపి వ్యతిరేకిస్తోందన్నారు. 

Don't Miss