'మిస్టర్' మూవీ రివ్యూ

20:09 - April 14, 2017

తన కామెడీతో యావరేజ్ కథలను కూడా బ్లక్  బాస్టర్స్ గా తీర్చి దిద్దే టాలెంటెడ్ డైరక్టర్ శ్రీనూ వైట్లా... కొనిదెల కాంఫౌండ్ హ్యాండ్సమ్ హీరో.. వరుణ్ తేజ్ తో మిస్టర్ సినిమాను తెరకెక్కించాడు. హెబ్బాపటేల్, లావణ్యా త్రిపాఠీ హీరోయిన్స్ గా నటించిన ఈ చిత్రాన్ని నల్లమలపు బుజ్జి, ఠాగూర్ మధు నిర్మించారు. ఈ రోజే థీయేటర్స్ లోకి వచ్చిన మిస్టర్ ఎలా ఉన్నాడు. ఎంత వరకూ ఆకట్టుకున్నాడో చూద్దాం... 
కథ..          
కథ విషయానికి వస్తే.. పిచ్చయ్య నాయుడూ అలియాస్ చేయ్... స్పెయిన్ లో హ్యాపీగా లైఫ్ గడిపేసే ఓ కూల్ గాయ్.. ఇండియానుండి అక్కడికి ఓ పనిమీద వెళ్లిన మీరాను చూసి ఇష్టపడుతాడు. ఆమెతో జరిగిన చిన్న జర్నీలో ఆమెను ప్రేమిస్తాడు. కాని ఆమె వేరొకరిని ప్రేమించాను అని చెప్పడంతో తాను ప్రేమిస్తున్న విషయాన్ని చెప్పకుండా ఉండిపోతాడు. అయితే ఇండియా వచ్చిన మీరా లవ్ కి ఓ అనూహ్యమైన ప్రబ్లమ్ ఎదురౌతుంది. తాను ప్రేమించిన అమ్మాయి ప్రబ్లమ్ లో ఉండటంతో దాన్ని సాల్వ్ చేయడానికి ఇండియాలో లాండ్ అవుతాడు చై. ఇంతకీ మీరా లవ్ కి ఎదురైన ఆ ప్రాబ్లమ్ ఏమిటి..? దాన్ని హీరో ఎలా పరీష్కరించాడు.. రెండోవ హీరోయిన్ అయిన చంద్ర ముఖీ ఎవరు ? ఆమె అసలు హీరోకి ఎలా కనెక్ట్ అయ్యింది.. ఇద్దరు హీరోయిన్స్ ప్రేమించిన మిస్టర్ చై ఎవరికి దక్కుతాడు అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.. 
విశ్లేషణ..
నటీనటుల విషయానికి వస్తే ఆరడుగుల హైట్ తో అదిరిపోయో లుక్స్ తో ఫస్ట్ సినిమాతో ఇంప్రెస్ చేసిన వరుణ్, ఈ సినిమాలో కూడా ఎప్పీరియన్స్ పరంగా ఆకట్టుకున్నాడు. కాని ఎమోషన్స్ పండించడంలో.. కామెడీ టైమింగ్ అందుకోవడంలో తడబడ్డాడు.. అయితే డాన్స్ ఫైట్స్ విషయంలో చాలా హార్డ్ వర్క్ చేయడంతో ఫర్వాలేదు అనిపించాడు. హీరోయిన్ హెబ్బా పటేల్ ఇప్పటివరకూ స్కిన్ షోతో హీరోయిన్ గా నెట్టుకొస్తున్నా... ఫస్ట్ టైం ఆమెకు ఫర్ఫామెన్స్ కూడా మిక్స్ అయిన క్యారక్టర్ దొరికిందీ. లుక్స్ పరంగా ఆక్టుకున్నా .. యాక్టింగ్ పరంగా యావరేజ్ అనిపించింది హెబ్బా.. ఇక సెకండ్ హీరోయిన్ లావణ్యా త్రిపాఠి పర్ఫామెన్స్ పరంగా మరోసారి ప్రూచేసుకోగా, స్క్రీన్ ప్రజెంట్స్ పరంగా కొంచెం కేర్ తీసుకుని ఉండాల్సిందీ అనిపిస్తుంది...  తన కామెడీతో సినిమాలను నిలబెట్టే పృధ్వీకీ రెగ్యూలర్ క్యారక్టర్ దొరకడంతో తన కామెడీతో పంచ్ లతో హ్యూమర్ వర్కౌట్ చేయాలని చూశాడు. అది కొంత వరకూ రిలీవ్ అనిపిస్తుంది. జబర్దస్త్ బ్యాచ్ అయినా శకలక శంకర్,  శేషూ ఓకే అనిపించారు. పెళ్ళిచూపులు కమెడియన్ ప్రియదర్శి, సత్యా... రఘుబాబు, శ్రీనివాస్ రెడ్దీ  క్వాలిటీ కామెడీ పండించారూ... ఇక సీనియర్ నటులైనా నాజర్, తనికెళ్ళ భరణీ, మురళీ శర్మ.... చంద్రమోహన్, నాగినీడు అంతా తమ పాత్రల పరిదిమేర మంచి పర్ఫామెన్స్ ఇచ్చారు. 
టెక్నీషియన్స్...
టెక్నీషియన్స్ విషయానికి వస్తే. అందరి దృష్టీ ఆకర్షించిన వ్యక్తి శ్రీనూ వైట్ల.. దూకుడూ లాంటి బ్లక్ బాస్టర్ ఇచ్చిన. కంబ్యాక్ మూవీగా మిస్టర్ నిలుస్తుంది అని అంతా ఎక్స్ పెర్ట్ చేశారు. ఆ ఎక్స్ పర్టేషన్స్ అందుకోవడంలో శ్రీను వైట్ల మరోసారి ఫేయిల్ అయ్యాడు. అస్తవ్యస్తమైన కథా.. కంన్ఫ్యూజింగ్ స్క్రీన్ ప్లే.. బోర్ కొట్టించే కామెడీ.. అసలు ఏమాత్రం కనెక్ట్ కాని ఎమోషన్స్ తో మిస్టర్ ను తీర్చిదిద్దాడు.. చాలా సన్నివేశాలలో అతని టేకింగి మొదటి సినిమా డైరక్టర్ లా అనిపించింది. కొన్ని కామెడీ సన్నివేశాల్లో శ్రీన వైట్ల టచ్ కనిపిస్తుంది. కాని డైరక్షన్ పరంగా మెరుపులు ఏమీ లేవు.  ఈ సనిమా టెక్నీషయన్స్ లో అందరి కంటే ఎక్కువ మార్కులు వేయాల్సింది, సినిమాటో గ్రాఫర్ గుహన్ కు. లిమిటెడ్ బడ్జెట్ లో టాప్ క్లాస్ విజ్యూవల్స్ ఇచ్చడు. సినిమాటోగ్రాఫీ ఈ సినిమాకు ఓ రిలీఫ్ పాయింట్ గా నిలవడం ఓ విశేషం. మ్యూజిక్ డైరక్టర్ మిక్కీజే మేయర్ తన స్ట్రైల్ కనిపించేలా ఓ రెండు పాటలు బ్యాగ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు. అవి తప్పిస్తే మ్యూజిక్ సినిమాకు ఏ విధంగానూ హెల్ప్ కాలేకపోయింది.. ఒకప్పుడు తన డైలగ్స్ తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన శ్రీధర్ సిపాన తన పూర్ ఫామ్ ను ఈ సీనిమాలో కూడా కంటిన్యూ చేశాడు.  పేలవమైన డైలాగ్స్ అందించాడు.. ఇందులో గోపీ మోహన్ పని చేసినా అతని ఎసెన్స్ ఎక్కడా కనిపించలేదు.. ప్రొడక్షన్ వాల్యూస్ తిరుగులేదు.. ఆహ్లాదకురమైన లొకేషన్స్ లో అన్ కాంప్రమైజ్డ్ విజ్యూవల్స్ కోసం చాలా ఖర్చు చేశారూ.. 
ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ కలిగించిన మిస్టర్               
ఓవర్ ఆల్ గా చెప్పాలంటే ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ కలిగించినా మిస్టర్ అనుకున్నంత రేంజ్ లో లేదనే చెప్పాలి.. బలాలు కన్నా బలహీనతలు ఎక్కువగా ఉండటంతో. పడుతూ లేస్తూ చివరివరకూ నెట్టుకోచ్చాడు. ఇక బాక్సాఫీస్ దగ్గర ఏ రేంజ్ కు చేరుకుంటాడో చూడాలి... 
ప్లస్ పాయింట్స్
మేకింగ్ వాల్యూస్
హీరో, హీరోయిస్స్
సినిమాటోగ్రాఫీ
మైనస్ పాయింట్స్
కథా
స్క్రీన్ ప్లే
డైరక్షన్ 
డైలాగ్స్
మ్యూజిక్
పేలని కామెడీ
పండని ఎమోషన్స్

రేటింగ్....1/5

 

Don't Miss