నీల్- లాల్ జెండా కలిస్తే ఎవరూ ఆపలేరు:ఏచూరి

18:26 - March 19, 2017

హైదరాబాద్: నీల్- లాల్ జెండా రెండూ కలిస్తే ఎవరూ ఆపలేరని సీపీఎం జాతీయ నేత సీతారం ఏచూరి తెలిపారు. సరూర్ నగర్ స్టేడియంలో జరుగుతున్న సమర సమ్మేళనం సభలో ఆయన పాల్గొన్నారు. తెలంగాణ సీపీఎం చేపట్టిన మహాజన పాదయాత్ర లాంటి యాత్రను మావో సేటుంగ్ లాంగ్ మార్చ్ తప్ప .. వేరే పార్టీ ఇంత సుదూర పాదయాత్ర చేసినట్లు చరిత్ర ఎక్కడా లేదు. ప్రజల సమస్యల ను గుర్తించి పాదయాత్ర సందర్భంగా ప్రతి రోజూ ఒక వినతి పత్రాన్ని సమర్పించారని.. వాటన్నింటిని సీఎం కేసీఆర్ పరిష్కరించాలని డిమాండ్ చేశారు. బంగారు తెలంగాణ చేస్తానన్న సీఎం కేసీఆర్ ఎప్పుడు ఏం సాధించారని సీతారం ప్రశ్నించారు. తెలంగాణ లో ప్రారంభం అయిన సామాజిక న్యాయం స్లోగన్ తో దేశవ్యాప్తం ఉద్యమం ప్రారంభం అయ్యిందన్నారు. హిందూ సమాజాన్ని ఏర్పాటు చేస్తామని యూపీ రాజకీయాలద్వారా బిజెపి, ఆర్ ఎస్ ఎస్ నిరూపిస్తోందన్నారు. మోడీ ప్లానింగ్ కమిషన్ ను రద్దు చేయడం వల్ల సామాజిక, ఆర్థిక రంగాల్లో దౌర్జాన్యాలు పెరుగుతున్నాయి. సామాజిక న్యాయం పేరుతో లాల్- నీల్ జెండాను కలిపుతూ ప్రజా ఉద్యమాలను బలోపేతం చేసి.. దోపిడీ లేని సమాజాన్ని నిర్మిస్తామని తెలిపారు.  

Don't Miss