కర్ణాటక ఎన్నికలు..డబ్బు ప్రభావం ఉందా ?

10:12 - May 15, 2018

బెంగళూరు : కర్ణాటక ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోరంగా వైఫల్యం చెందడం..కాషాయ పార్టీ ఇక్కడ పాగా వేస్తోందని ఫలితాలను బట్టి తెలుస్తోంది. ఈ ఎన్నికల్లో డబ్బు ప్రభావం చూపిందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఈ ఎన్నికల్లో హంగ్ ఏర్పడుతుందని ఎగ్జిట్ పోల్స్ ప్రకటించినా అవి అంత నిజం కాదని తేలుతోంది. మైనింగ్ మాఫియాలాంటి ముద్ర వేసుకున్న వారు..సీబీఐ కేసుల్లో ఇరికిన వారు అనుచరులకు సీట్లు కేటాయించడం పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అవినీతి..కాంగ్రెస్ వ్యతిరేకంగా అధికారంలోకి వచ్చిన బీజేపీ ఈ ఎన్నికల్లో మాత్రం అవినీతిని అరికట్టడంలో వైఫల్యం చెందిందని పలువురు పేర్కొంటున్నారు. నల్లధనాన్ని కంట్రోల్ చేయడానికే పెద్ద నోట్ల రద్దు చేశామని పేర్కొన్న బీజేపీ ఈ ఎన్నికల్లో ఇంత పెద్ద ఎత్తున డబ్బు ప్రభావం ఎలా కనిపించిందనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. నల్లధనం అరికట్టడం..అవినీతిని అరికట్టడంలో బీజేపీ ఘోరంగా వైఫల్యం చెందినా కాంగ్రెస్ వ్యతిరేకత వారికి లాభం కలిగించిందనే వార్తలు వెలువడుతున్నాయి.

మరోవైపు కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో ఎంత బలహీనంగా ఉందో ఈ ఎన్నికలను బట్టి చెప్పవచ్చని అంచానాలు వేస్తున్నారు. ప్రతిపక్ష స్థానాన్ని కొనసాగించలేని పరిస్థితిలో ఉందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. కావేరీ, నది జలాలకు సంబంధించి బీజేపీకి కొంత సానుకూలత, కాంగ్రెస్ కున్న బలహీనత బీజేపీకి బలంగా కొనసాగడానికి ప్రభావం చూపాయనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. 

Don't Miss