చంద్రబాబును కలిసిన ముఖేశ్ అంబానీ

21:35 - February 13, 2018

గుంటూరు : రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముఖేశ్ అంబానీ... అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో భేటీ అయ్యారు. గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న అంబానికి ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌ స్వాగతం పలికారు. అక్కడి నుంచి హెలీకాఫ్టర్‌లో అమరావతి చేరుకుని.. నేరుగా రియల్‌ టైం గవర్నెన్స్‌ కేంద్రానికి వెళ్లి సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన రియల్‌ టైం గవర్నెన్స్‌ పనితీరును పరిశీలించారు. ఈ భేటీ అనంతరం సీఎం నివాసంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక విందులో అంబానీ పాల్గొన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే అంశంపై ఇరువురి మధ్య చర్చ జరిగింది. రాయలసీమలో సెల్‌ఫోన్‌ తయారీ పరిశ్రమ ఏర్పాటుకు ఆయా కంపెనీలను ఒప్పించాలని ముఖేశ్‌ను మంత్రి లోకేష్‌ కోరారు. అన్ని సౌకర్యాలు కల్పిస్తే.. రెండువారాల్లోగానే సెల్‌ఫోన్‌ల కంపెనీకి శంకుస్థాపన చేస్తామని ముఖేశ్‌ అంబాని తెలిపారు. 

Don't Miss