కండరాల నొప్పులకు...

10:00 - January 20, 2017

వయస్సు ఏదైనా కండరాల నొప్పులతో బాధ పడుతున్నారు. మారుతున్న జీవన శైలికి దీనికి ముఖ్య కారణమని చెప్పవచ్చు. నడుం..కండరాల నొప్పుల నుండి విముక్తి పొందాలంటే కొన్ని చిట్కాలు పాటిస్తే సరిపోతుందని వైద్యులు పేర్కొంటున్నారు.

  • బరువైన వస్తువులను ఎత్తే సమయంలో చేతులతో కాకుండా యంత్రాలతో ఎత్తడం మంచిది. ప్రమాదాలను అరికట్టడమే కాకుండా నొప్పులు రాకుండా ఉంటుంది.
  • పనిముట్లు వాడే సమయంలో చేయి..మణికట్టు భంగిమ పట్ల చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది.
  • తరచూ వాడే వస్తువులను అందుబాటులో ఉంచుకోవాలి. ఒకే వస్తువు కోసం పలుమార్లు తిరగడం వల్ల నరాలపై ఒత్తిడి కలుగ చేస్తుంది.
  • వెన్ను భాగం నిటారుగా ఉండేలా పనిచేయాల్సి ఉంటుంది. తరచూ వెన్నెముకను వంచడం..మెలితిప్పడం ప్రమాదాలకు దారి తీస్తుంది.
  • నేల మీద కూర్చొని పనిచేయాల్సి వస్తే కాళ్లు మడిచి..మోకాళ్లు నేలకు ఆనుకుని ఉండేటట్లు కూర్చొవాలి. అంతేగాకుండా వెన్నెముక నిటారుగా ఉంచే ప్రయత్నం చేయాలి.
  • నిలబడి పనిచేయాల్సి వచ్చినప్పుడు ప్రతి అరగంటకొకసారి భంగిమను మార్చుకొంటే ఉపయోగం.
  • నిలబడి పనిచేసేటప్పుడు రెండు కాళ్ల మధ్య దూరం రెండు భుజాల మధ్య ఉన్నంత ఉండాలి. దీనితో మోకాళ్లు, అరికాళ్ల నొప్పులు రావు.
  • ఉద్యోగం..మరేవైనా విధులు..ఇంటి పనిచేసే సమయంలో కొన్ని జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుందని వైద్యులు పేర్కొంటున్నారు. 

Don't Miss