మహా కూటమికి నా మద్ధతు: అబ్దుల్ ఘనీ

12:51 - November 6, 2018

హైదరాబాద్ : అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓటమే లక్ష్యంగా ఏర్పడిన మహాకూటమి ఏర్పడింది. ఎన్నో ఇబ్బందులు..సమస్యలను ఎదుర్కొంటు..అందరినీ సమన్వయ పరుచుకుంటు కొనసాగుతున్న మహాకూటమికి మరో పార్టీ వచ్చి చేరింది. కూటమిపై పలు విమర్శలు టీఆర్ఎస్ సంధిస్తోంది. ఎద్దేవా చేస్తోంది. అది మహా కూటమి కాదు కుంపట్ల కూటమి అంటు విమర్శలు చేస్తున్న నేపథ్యలో ఈ మహాకూటమిలోకి ఓ ముస్లింపార్టీ వచ్చి చేరింది. ప్రస్తుతం ఈ కూటమిలో కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సీపీఐలు ఉన్నాయి. తాజాగా, ఆల్ ఇండియా ముస్లిం నేషనల్ లీగ్ పార్టీ కూడా చేరింది. ఈ సందర్భంగా ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి అబ్దుల్ ఘనీ మాట్లాడుతూ, మహాకూటమికి బేషరతుగా మద్దతు ఇస్తున్నామని చెప్పారు.
రిజర్వేషన్ల విషయంలో ముస్లింలను ముఖ్యమంత్రి కేసీఆర్ మోసం చేశారని మండిపడ్డారు. ముస్లింలకు ఇచ్చిన హామీలను అటకెక్కించారని... తగిన నిధులను కూడా కేటాయించలేదని దుయ్యబట్టారు. బీజేపీ, ఎంఐఎం, టీఆర్ఎస్ ల మధ్య రహస్య ఒప్పందం ఉందని ఆరోపించారు. ముస్లింలను మోసం చేసిన టీఆర్ఎస్ ను ఓడించడమే తమ లక్ష్యమని... అందుకే, మహాకూటమికి మద్దతు ఇవ్వాలని నిర్ణయించామని చెప్పారు. 
 

Don't Miss