హరీశ్ రావ్ సీఎం అవుతారు : రేవూరి ప్రకాశ్

16:09 - November 6, 2018

వరంగల్ : తెలంగాణలో ఎన్నికల సమయం రోజు రోజుకూ ఊపందుకుంటోంది. టీఆర్ఎస్ ఇప్పటికే దూసుకుపోతోంది. టీఆర్ఎస్ ప్రచారంలో కీలకంగా వ్యవహరిస్తున్న హరీశ్ రావు తనదైన ముద్ర వేసుకుంటున్నారు. ఈ నేపత్యంలో టీఆర్ఎస్ గెలిస్తే హరీశ్ రావు సీఎం అవుతాడంటు టీఆర్ఎస్ ఓటమే లక్ష్యంగా ఏర్పడిన మహాకూటమిలో భాగస్వామిగా వున్న టీడీపీ నేత వ్యాఖ్యలు ఇప్పుడ సంచలనంగా మారాయి. ‘‘తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన.. రాష్ట్రం రావడానికి,అధికారం చేజిక్కించుకోవడానికి విశేషంగా కృషి చేసిన హరీశ్‌ రావు పరిస్థితులు అనుకూలిస్తే ఆయన సీఎం అయినా ఆశ్చర్యపోనక్కరలేదు’’ అని టీడీపీ నేత రేవూరి ప్రకాశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హరీశ్‌ను అడుగడుగునా అవమానిస్తున్నారనీ.. దీంతో టీఆర్‌ఎస్‌లో అంతఃకలహాలు తీవ్రస్థాయికి చేరుకున్నాయనీ..వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎ్‌సకు మెజారిటీ సీట్లు రాకపోతే హరీశ్‌ తన వర్గంతో బయటకు వచ్చే అవకాశాలు పూర్తిగా వున్నాయని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు రేవూరి ప్రకాశ్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. ఎన్నికల తర్వాత కర్ణాటకలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలు ఇక్కడ పునరావృతమయ్యే అవకాశాలు లేకపోలేదన్నారు. కేటీఆర్‌, కవిత వచ్చిన తర్వాత హరీశ్‌ను క్రమంగా పక్కన పెడుతున్నారని, ఆయన పరిస్థితి చూస్తుంటే జాలేస్తోందని అన్నారు. కేసీఆర్‌ హరీశ్‌ను పక్కకు తోసేసి కేటీఆర్‌కు పెద్దపీట వేస్తున్నారని తెలిపారు. తన నిజాయితీని నిరూపించుకునే ప్రయత్నంలో టీడీపీపైనా, చంద్రబాబుపైనా హరీశ్‌ అవాకులు చెవాకులు పేలడం సరికాదన్నారు. హరీశ్‌ పోరాటానికి తమ మద్దతు ఉంటుందన్నారు. 

Don't Miss