దేశవ్యాప్తంగా నీట్ ఎగ్జామ్ ప్రారంభం

10:52 - May 6, 2018

హైదరాబాద్ : దేశవ్యాప్తంగా జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్) ప్రారంభం అయింది. ఎంబీబీఎస్, బీడీస్ వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశానికి నీట్ పరీక్ష జరుగుతోంది. ఉదయం 10 గంటలకు పరీక్ష ప్రారంభం అయింది. మధ్యాహ్నం ఒంటిగంట వరకు పరీక్ష కొనసాగనుంది. ఉదయం 7.30 గంటల నుంచి 9.30 గంటల వరకు మాత్రమే ఎగ్జామ్ సెంటర్ లోకి అనుమతిస్తారు. దేశవ్యాప్తంగా 13లక్షల 26 వేల మంది నీట్ పరీక్ష రాస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో 2 లక్షల మంది అభ్యర్థులు పరీక్ష రాస్తున్నారు. తెలంగాణలోని హైదరాబాద్, ఖమ్మం, వరంగల్ లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఏపీలోని విజయనగరం, విశాఖ, కాకినాడ, రాజమహేంద్రవరంలో  ఎగ్జామ్ నిర్వహిస్తున్నారు. 
ఎండలో విద్యార్థులు 
కృష్ణా జిల్లాలో నీట్ ఎగ్జామ్ ప్రారంభం అయింది. జిల్లా వ్యాప్తంగా 31 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. 17,536 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నారు. ఉదయం 7.30 నుండి విద్యార్థులను అధికారులు ఎండలో నిలబెట్టారు. గంటలేటుగా పరీక్ష హాల్ లోకి విద్యార్థులను అధికారులు అనుమతించారు. విద్యార్థులను ఎండలో నిల్చోబెట్టడంపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

 

Don't Miss