రెవెన్యూ అధికారుల తీరుతో మహిళారైతు మృతి

10:13 - October 9, 2017

సంగారెడ్డి : రెవెన్యూ అధికారుల వేధింపులతో సంగారెడ్డి జిల్లా న్యాలక్కల్‌ మండలం  మామిడ్గి  విలేజ్‌లో ఓ మహిళారైతు మృతి చెందింది. జహీరాబాద్‌లో ఏర్పాటు చేస్తున్న నిమ్జ్‌ ఇన్‌స్టిట్యూట్‌ కోసం భూములను సేకరిస్తున్న అధికారులు న్యాల్‌కల్‌ గ్రామంలో భూములను కూడా సేకరిస్తున్నారు. ఈ క్రమంలోనే గత మూడు రోజులుగా  రెవెన్యూ అధికారులు మామిడ్గి విలేజ్‌లో పర్యటించారు. నిమ్జ్‌ కోసం భూములు తీసుకున్నామని.. మీరు అభ్యంతర పెట్టిన భూముల సేకరణ ఆగదని రైతులను భయపెట్టారు. దీంతో తమ భూములు దక్కవన్న ఆందోళనతో మహిళారైతు పార్వతమ్మ గుండెపోటుకు గురై మృతి చెందిందని గ్రామస్థులు అంటున్నారు. భూములను బలవంతంగా సేకరించవద్దని హైకోర్టు ఆదేశించినా.. అధికారులు, పోలీసులు రైతులను బెదిరిస్తున్నారని నిమ్జ్‌ భూపోరాటకమి ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. 

 

Don't Miss