మళ్లీ 'నిట్' వద్ద ఉద్రిక్తత...

13:22 - February 13, 2018

పశ్చిమగోదావరి : జిల్లాలోని తాడేపల్లి గూడెంలో నిట్ కాలేజీలో మళ్లీ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఇటీవలే జరిగిన ర్యాగింగ్ ఘటనలో నిట్ ర్యాంగింగ్ కమిటీ నిర్ణయాలు తీసుకుంది. ఈ నిర్ణయాలను సీనియర్..జూనియర్ విద్యార్థులు వ్యతిరేకిస్తున్నారు. మంగళవారం నిట్ కాలేజీ ఎదుట బైఠాయించి ఆందోళన చేపట్టారు.

ర్యాగింగ్ ఘటనలో కళాశాల నుండి ఒకరిని బహిష్కరించగా మరో ఐదుగురిపై రెండేళ్ల పాటు సస్పెన్షన్ విధిస్తూ నిర్ణయం తీసుకుంది. విద్యార్థుల బహిష్కరణను ఇతర విద్యార్థులు వ్యతిరేకించారు. ఆ రోజు జరిగింది ఘర్షణ మాత్రమేనని, ర్యాగింగ్ కాదని పేర్కొన్నారు. ఫిర్యాదును వెనక్కి తీసుకున్నారని, చిన్న తప్పిదానికి కాలేజీ నుండి నుండి బహిష్కరించడం సరికాదన్నారు. డిమాండ్లు పరిష్కరించకపోతే ఆత్మహత్య చేసుకుంటామని సస్పెన్షన్ కు గురైన విద్యార్థులు హెచ్చరించారు. 

Don't Miss