డిప్రెషన్‌తోనే మధుకర్‌ ఆత్మహత్య: భార్య స్వాతి

06:45 - April 13, 2017

యాదాద్రి భువనగిరి : కొన్ని గంటల క్రితం జరిగిన ఘటకు సంబంధించిన బాధితురాలు స్వాతి పెదవి విప్పారు... ఎన్నారై మధుకర్‌రెడ్డి మరణం అనుమానాస్పదమంటూ...అందుకు కారణం భార్య స్వాతి అని ఆమెపై అంత్యక్రియల సమయంలో దాడి జరిగిన సంగతి తెలిసిందే...తన భర్తను హింసించిందని...రకరకాలుగా వేధించిందని... చివరకు ఆమెనే చంపిందంటూ మెట్టినింటివారు.. బంధువులు స్వాతిపై దాడికి దిగారు...

మధుకర్‌రెడ్డి అంత్యక్రియల్లో జరిగిన దాడితో ...

మధుకర్‌రెడ్డి అంత్యక్రియల్లో జరిగిన దాడితో ఒక్కసారి ఉత్కంఠభరితమైన వాతావరణం నెలకొంది..ఊహించని విధమైన దాడితో స్వాతి..ఆమె కుటుంబీకులు భయభ్రాంతులకు గురయ్యారు..అప్పటికే బంధువులు దాడిని అడ్డుకోగా... పోలీసులు రావడంతో కాస్త సద్దుమణిగింది..వెంటనే స్వాతి పేరెంట్స్‌తో కలిసి పోలీసు స్టేషన్ వెళ్లి తనకు ప్రాణహానీ ఉందంటూ...రక్షణ కల్పించాలంటూ వేడుకుంది...

తనకు సంబంధం లేదు..

కాలిఫోర్నియాలో ఉంటున్న మధుకర్‌రెడ్డి కొంతకాలంగా ఉద్యోగానికి సంబంధించిన డిప్రెషన్‌లో ఉన్నారని...అదే మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడని చెబుతుంది భార్య స్వాతి....తన భర్త అంత్యక్రియలకు వెళ్లినప్పుడు తనపై దారుణంగా దాడి చేశారని.. ఆవేదన వ్యక్తం చేశారు. తనకు, తన పాప ప్రాణాలకు రక్షణ కల్పించాలని కోరుతుంది స్వాతి..

మా మధ్య చిన్న గొడవలే..

మధుకర్‌ తనపై చేయి చేసుకున్నాడని...అయినా భరిస్తూ కాలం వెళ్లదీస్తున్నానంటోంది స్వాతి... భార్యాభర్తల మధ్య గొడవలున్నాయని..అయితే అవి చంపుకునేంత..చచ్చిపోయేంత పెద్దవి కావంటోంది స్వాతి...

అత్తమామలకు చెప్పినా శూన్యం..

అయితే తమ ఇద్దరి మధ్య చిన్న చిన్న గొడవలున్నా..భర్త డిప్రెషన్‌లో ఉంటున్న విషయాన్ని ఎప్పటికప్పుడు అత్తమామలతో చెప్పానని..వారు మాత్రం పట్టించుకోలేదంటోంది స్వాతి...బంధువులు..ఇంట్లోవారు చెప్పిన మాటల ప్రభావంతో మధుకర్‌లో చాలా మార్పు వచ్చిందని..ఆ మార్పుకు నిదర్శనమే తనపై చేయి చేసుకోవడమని చెబుతోంది..ఏదీ ఏమైనా తన జీవితం అగమ్య గోచరమైందని...ఇప్పుడు జరిగిన దాడితో భయం కూడా పట్టుందంటోంది...

Don't Miss