త్వరలో 'జై లవకుశ' లుక్స్ విడుదల...

09:26 - May 10, 2017

జూనియర్ ఎన్టీఆర్ తన తాజా చిత్రం 'జై లవకుశ' షూటింగ్ కొనసాగుతోంది. 'టెంపర్' ఘన విజయం అనంతరం ఈ చిత్రంలో నటిస్తుండడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. బాబీ దర్శకత్వంలో సోదరుడు కళ్యాణ్ రామ్ స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో అనేక విశేషాలు కలిగి ఉన్నాయి. ఎన్టీఆర్ త్రిపాత్రాభియనం చేస్తున్నట్లు టాక్ రావడంతో అభిమానుల్లో ఒక్కసారిగా ఉత్కంఠ నెలకొంది. మూడు పాత్రల్లో ఎలా ఉంటారనే దానిపై టాలీవడ్ లో చర్చ జరుగుతోంది. ఓ పాత్ర పూర్తిగా నెగటివ్ గా ఉంటుందని, ఇందుకు హాలీవుడ్ మేకప్ మెన్ ఎన్టీఆర్ కు మేకప్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే విడుదల చేసిన మోషన్ పోస్టర్ సినిమాపై అంచనాలు మరింత పెంచేసింది. మే 20వ తేదీన తారక్ తన పుట్టిన రోజు సందర్భంగా ఆయన అభిమానులను మెస్మరైజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. 'జై లవకుశ' మూడు పాత్రల లుక్స్ ని విడుదల చేస్తారని తెలుస్తోంది. మరి ఆ పాత్రలు ఎలా ఉండనున్నాయి తెలువాలంటే కొద్ది రోజులుగా వేచి చూడాల్సిందే. 

Don't Miss