నాగావళి ఉధృతి చూడండి..

16:09 - July 16, 2017

విజయనగరం : నాగావళి నది పరవళ్లు తొక్కుతోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఒడిశాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీనితో నాగావళి ఉధృతం పెరిగిపోయింది. కళ్యాణ్ సింగ్ పూర్ లో నీట మునగగా మరో 30 గ్రామాలు జలదిగ్భందనంలో చిక్కుకపోయాయి. నాగావళి ఉధృతితో ఆంధ్రా..ఒడిషా రాష్ట్రాల మధ్య రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. కొమరాడ మండలంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.

విజయనగరం జిల్లాపై..
నాగావళి ఉధృతి విజయనగరం జిల్లాపై ప్రభావం పడింది. పార్వతీపురం నియోజకవర్గంలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కొమరాడ (మం) కోనేరు వద్ద జాతీయ రహదారిపైకి భారీగా వరద నీరు చేరడంతో రాకపోకలు తీవ్రంగా స్తంభించిపోయాయి. గత నాలుగైదు గంటలుగా ఎక్కడి వాహనాలు నిలిచిపోయాయి. కొమరాడ మండలంలోని పలు గ్రామాలు నీట మునిగిపోయాయి. ఎగువ ప్రాంతాలకు వీరిని తరలించేందుకు అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. రాయగడ జిల్లా కళ్యాణ సింగుపూర్ నీట మునగగా తెరుబలి వద్ద రైల్వే బ్రిడ్జి కొట్టుకపోయింది.

వాహనదారుల ఇక్కట్లు..
జాతీయ రహదారి..ఇతర ప్రాంతాల్లో వరద ఉధృతి పెరగడంతో వాహనాలు నిలిచిపోయాయి. దీనితో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నాగావళి ఉధృతితో తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని లోతట్టు ప్రాంతాల వాసులు పేర్కొంటున్నారు. వాహనాలు నిలిచిపోవడంతో తాము వంట వండుకోవడానికి సరుకులు కూడా లేవని, కనీసం తాగడానికి మంచినీరు కూడా లేదని వాహన డ్రైవర్లు..సిబ్బంది పేర్కొంటున్నారు.

Don't Miss