మహాకూటమి నేతలపై నాయిని తీవ్ర పదజాలం..

12:18 - November 30, 2018

హైదరాబాద్ : టీఆర్ఎస్ ఓటమే లక్ష్యంగా ఏర్పడిన మహాకూటమి ప్రచారంతో హోరెత్తిస్తోంది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీలు ప్రచారంపై టీఆర్ఎస్ సీనియర్ నేత నాయిని నర్సింహారెడ్డి తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు.ఓ బక్క పలచని వ్యక్తిని ఎదుర్కోవడానికి మోసగాళ్లంతా కూటమిగా వస్తున్నారని ధ్వజమెత్తారు. ఓట్లు అడగడానికి వస్తున్నారని ‘సిగ్గులేదురా మీకు’’ అని కాంగ్రెస్, టీడీపీ నాయకులను ఉద్దేశించి తీవ్రస్థాయిలో వ్యాఖ్యానించారు. ‘‘ఒక్కడిని ఎదుర్కోవడానికి కలిసి రావాలారా? దమ్ము లేదురా మీకు.. ఒక్కొక్కరుగా రండి’’ అని నాయిని  సవాలు విసిరారు.

 

Don't Miss