జాతీయ మెరుపుల రాణి..

10:24 - September 26, 2018

హైదరాబాద్ : ప్రతిభ అనేది ఎవరూ దాచేస్తే దాగేది కాదు. దానికి తగిన రాణింపు కాస్త ఆలస్యమైనా సరే వెలుగులోకి రాక తప్పదు..పలువురి ప్రశంసలు అందుకోకమానదు. దానికి కొద్దిగా ఓపిక..ఆత్మవిశ్వాసం కూడా తోడైతే..ఆ ప్రతిభ మరింతగా రాణిస్తుంది. సైనా నెహ్వాల్‌ సూపర్‌ సిరీస్‌ టైటిళ్లతో హోరెత్తిస్తున్న రోజుల్లో.. పి.వి.సింధు పేరే వినిపించని కాలంలో.. జాతీయ స్థాయిలో ఆ  ఓ అమ్మాయి పెను సంచలనం సృష్టించింది. అంతర్జాతీయ వేదికల మీద సైనా సత్తాచాటుతుండగా.. జాతీయ స్థాయిలో మెరుపులన్నీ ఆ అమ్మాయివే! సైనా వారసురాలిగా..ఆమెను మించిపోయే క్రీడాకారిణిగా ప్రశంసలు! అంతలోనే.. అనుకోని అవాంతరం ఆమెను అదిమిపెట్టేసింది. మోకాలి గాయం. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 4 ఆపరేషన్లు! పూర్తిగా సంవత్సరకాలం మంచం దిగొద్దని వైద్యుల హెచ్చరిక! ఇక బ్యాడ్మింటన్‌ ఆడలేవనీ..రాకెట్‌ పట్టలేని పరిస్థితి.
కానీ అంతులేని ఆత్మవిశ్వాసంతో ధైర్యం చేసిం సంకల్పంతో మళ్లీ రాకెట్ పట్టేంత తెగువ చూపింది. అగ్రశ్రేణి డబుల్స్‌ క్రీడాకారిణిగా సరికొత్త ప్రస్థానం. అంతర్జాతీయ వేదికల మీద మువ్వన్నెల జెండాను రెపరెపలాండించింది. ఈ నేపథ్యంలోనే కాస్త ఆలస్యమైనా  ఆమెనే వెతుక్కుంటూ వచ్చిన అర్జున అవార్డు! గాయాలతో మధ్యలోనే కెరీర్‌లను వదిలేస్తున్న ఎంతోమందికి స్ఫూర్తినిచ్చే విజయగాథ నేలకుర్తి సిక్కిరెడ్డిది. ఓరుగల్లు విసిన రాకెట్ నేలకుర్తి సిక్కిరెడ్డి. 
 రాష్ట్రపతి చేతులమీదుగా నేలకుర్తి సిక్కిరెడ్డి అర్జున పురస్కారాన్ని అందుకుంది. రాష్ట్రపతి భవన్ లో జరిగిన క్రీడా అవార్డుల కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చేతుల మీదుగా తన ప్రతిభకు తగిన పురస్కారాన్ని అందుకున్న నేలకుర్తి సిక్కిరెడ్డికి అభినందనలు..

 

Don't Miss