సూర్యాపేట కుటుంబ ఆత్మహత్య కేసులో అరెస్టులు

17:31 - September 21, 2017

సూర్యాపేట : జిల్లా కేంద్రంలోని మూకుమ్మడి కుటుంబ ఆత్మహత్య కేసుకి సంబంధించి.. జిల్లా పోలీసులు ముగ్గురిని అరెస్ట్‌ చేశారు. ఆత్మహత్యకు ప్రేరేపించినవారిని.. సెక్షన్‌ 306 ప్రకారం రిమాండ్‌కు తరలిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. జనార్ధన్‌ పెద్ద కుమారుడు సురేశ్ చేసిన అప్పులకు.. అప్పిచ్చినవారు డబ్బు చెల్లించాలని ఒత్తిడి చేశారు. చిన్న కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని 14 లక్షలు తీసుకొని.. ఉద్యోగం ఇప్పించకుండా మోసం చేశారు. తీసుకున్న డబ్బు తిరిగివ్వకుండా వెంపటి సత్యనారాయణ, బెంజారపు ఉపేందర్‌లు మోసం చేశారు. అప్పు ఇచ్చినవారు చేసిన అవమానాన్ని భరించలేక.. ఈ నెల 17న జనార్ధన్‌, అతని భార్య చంద్రకళ, చిన్న కుమారుడు అశోక్, పెద్ద కోడలు ప్రభాత, వారి పిల్లలు శాన్వి, రుత్విక సహా ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనలో ఆరుగురు చనిపోవడంతో సూర్యాపేట పట్టణంలో తీవ్ర కలకలం రేగింది. పెద్ద కొడుకు సురేశ్‌ పూణే వెళ్తున్నానని చెప్పి తిరిగి రాకపోవడం, మూడున్నర కోట్లు అప్పిచ్చినవారు జనార్ధన్‌ను అడగడంతో కుటుంబం మొత్తం ప్రాణాలు తీసుకుంది. అయినా సురేశ్‌ రాకపోవడం, అతని ఆచూకీ తెలియకపోవడం అనుమానాలకు తావిస్తోంది. 

Don't Miss