అధికారంలోకి వస్తాం, హైదరాబాద్ పేరు మార్చేస్తాం..

08:00 - November 9, 2018

హైదరాబాద్ : బీజేపీ పేర్లు మార్పు కార్యక్రమంలో సరికొత్త వివాదాలకు తెరలేపుతోంది. ఈ క్రమంలో అధికారంలోకి వచ్చిన వెంటనే ముస్లిం పేర్ల మీద ఉన్న సంస్థలన్నింటినీ హైందవీకరిస్తున్న ఉత్తరప్రదేశ్‌లోని బీజేపీ ప్రభుత్వం ఆ దిశగా మరో వివాదానికి తెరతీసింది. ఈ నేపథ్యంలో తెలంగాణలో బీజేపీ మాజీ ఎమ్మెల్యే మరో సంచలన, వివాదాలకు పూనుకున్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్ ల పేర్లు మార్చేస్తామని ప్రకటించారు. తాము అధికారంలోకి రావటం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు. అసలు పేరు భాగ్యనగరమని... 1590లో భాగ్యనగరం పేరును హైదరాబాదుగా కులీ కుతుబ్ షా మార్చారని తెలిపారు. తాము మళ్లీ అసలైన పేరును పెట్టాలనుకుంటున్నామని చెప్పారు. 

hyderabad historical places కోసం చిత్ర ఫలితంతెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని... రాష్ట్ర అభివృద్ధి తమ ప్రథమ లక్ష్యమని, తదుపరి లక్ష్యం హైదరాబాద్ పేరు మార్చడమేనని అన్నారు. మొఘలులు, నిజాంల పేరిట ఉన్న పేర్లను తొలగిస్తామని... దేశం కోసం, తెలంగాణ కోసం పోరాడిన వ్యక్తుల పేర్లను పెడతామని రాజా సింగ్ తెలిపారు.
కాగా ఇప్పటికే దేశంలోని అతి పురాతనమైన మొగల్‌సరారు జంక్షన్‌ను దీన్‌ దయాల్‌ ఉపాధ్యాయ జంక్షన్‌గా మార్చిన యోగి సర్కారు.. తాజాగా రాష్ట్రంలోని మూడు విమానాశ్రాయాల పేర్లను మార్చాలని నిర్ణయించింది. రారుబరేలి, కాన్పూర్‌, ఆగ్రాలో ఉన్న రక్షణ శాఖ విమానాశ్రాయాల పేర్లను మార్చనుంది. బరేలి విమానాశ్రాయాన్ని నాథ్‌నగరిగా (పౌరాణికాల్లో బరేలి పేరు), కాన్పూర్‌లోని చకేరి ఎయిర్‌పోర్ట్‌కు గణేష్‌ శంకర్‌ విద్యార్థి పేరు, ఆగ్రా విమానాశ్రాయాన్ని దీన్‌ దయాల్‌ ఉపాధ్యాయగా మార్చాలని ప్రతిపాదించారు. దీనిపై కేంద్రానికి ప్రతిపాదనలు పంపించామని.. త్వరలోనే కేంద్ర విమానయాన శాఖతో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని యూపీ మంత్రి నంద్‌గోపాల్‌ నంది తెలిపారు. అలహాబాద్ పేరును ‘ప్రయాగ్ రాజ్‘గా మార్చే పనిలో వుంది యోగీ సర్కార్. 

Don't Miss