చిత్ర విజయం తెలుగు ప్రజలందరిది: బాలకృష్ణ

14:19 - January 12, 2017

హైదరాబాద్: 'గౌతమి పుత్ర శాత‌క‌ర్ణి' సినిమా విజయం తెలుగు ప్రజలందరిది అని హీరో సినీనటుడు బాలకృష్ణ అన్నారు. ఈ రోజు హైద‌రాబాద్‌లోని ప్ర‌సాద్ ఐమ్యాక్స్ కు బాల‌య్య‌తో పాటు సినిమా ద‌ర్శ‌కుడు క్రిష్‌, న‌టి శ్రియ వ‌చ్చారు. ఈ సంద‌ర్భంగా మీడియాతో బాల‌కృష్ణ మాట్లాడుతూ... అస‌మాన శూరుడి పాత్రను తాను చేయడం ఓ అదృష్ట‌మ‌ని అన్నారు. ఇది నాన్న‌గారు (ఎన్టీఆర్‌) చేయాల‌నుకున్న పాత్ర అని ఆ పాత్ర‌ను తాను చేయ‌డం త‌న‌ పూర్వ‌జ‌న్మ సుకృతంగా భావిస్తున్న‌ట్లు తెలిపారు. అద్భుత‌మైన స్పంద‌న‌ను అందుకోవ‌డం ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు. పంచ‌భ‌క్ష ప‌రమాన్నం అందించిన‌ట్లు సినిమాకు ప‌నిచేసిన బృందం ఈ సినిమాలో అన్నిటినీ క‌లిపారని బాలయ్య చెప్పారు. సాయిమాధ‌వ్ మంచి మాట‌లు అందించార‌ని అన్నారు.

Don't Miss