@నర్తనశాల మూవీ రివ్వ్యూ..

18:54 - August 30, 2018

ప్రస్తుతం చిన్న సినిమాల హవా నడుస్తోంది. తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న చాలా సినిమాలు ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. పలువురి మన్ననలు పొందుతున్నాయి. మరికొన్ని సినిమాలైతే భారీ విజయాలు అందుకుని నిర్మాతలకు కోట్లు తెచ్చిపెడుతున్నాయి. హీరో, హీరోయిన్‌లు ఎవరనేది చూడకుండా కథ, కథనం బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఛలో సినిమా విజయోత్సవంలో వున్న నాగశౌర్య లాంటి చిన్న హీరోలు కామెడీ ప్రధానంగా ఉండే కథలను ఎంపిక చేసుకుంటున్నారు. ఈ ఏడాది ‘ఛలో’ సినిమాతో తన ప్రయాణాన్ని మొదలుపెట్టిన నాగశౌర్య మళ్లీ అలాంటి హాస్యప్రదమైన చిత్రం ‘@నర్తనశాల’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ట్రైలర్, ప్రోమోలతో ప్రేక్షకుల్లో ఆసక్తిని కలుగజేసిన ఈ సినిమా రివ్వ్యూని చూద్దాం..

Don't Miss