రవిశంకర్ పై ట్రిబ్యునల్ ఆగ్రహం..

09:34 - April 21, 2017

ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాకుడు శ్రీశ్రీ రవిశంకర్ పై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. గతేడాది ఆర్ ఆఫ్ లివింగ్ యుమన నది వద్ద భారీ సదస్సు నిర్వహించిన సంగతి తెలిసిందే. దీని వల్ల ఎంతో నష్టం వాటిల్లిందనే విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై నిపుణల కమిటీ నివేదిక సమర్పించింది. నష్టం భర్తీ చేసేందుకు ఏకంగా పదేండ్ల సమయం పడుతుందని, రూ. 13.29 కోట్లు ఖర్చువుతుందని నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం. దీనిపై శ్రీశ్రీ రవిశంకర్ పలు వ్యాఖ్యలు చేశారు. యమునా కరకట్టలు భారీగా దెబ్బతిన్నాయని, వాటిని సరిచేసేందుకు పదేండ్ల సమయంతో పాటు పెద్దమొత్తంలో నిధులు వెచ్చించాల్సి ఉంటుందని ఇచ్చిన నివేదికపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. వివక్షతో కూడుకున్నదని వ్యాఖ్యానించారు. దీనిపై ట్రిబ్యునల్ తీవ్రంగా తప్పుబట్టింది. ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ బాధ్యతా రాహిత్యంగా వ్యవహరిస్తున్నదని, వారు తమకు తోచినట్టు మాట్లాడే స్వేచ్ఛ ఉన్నట్టుగా భావిస్తున్నారని ట్రిబ్యునల్‌ ఆక్షేపించింది. మే 9న తదుపరి విచా రణ చేపడతామని ప్రకటించింది.

Don't Miss