ఇళ్లు పరిమళభరితం ఎలా ?

11:30 - September 15, 2018

ఇళ్లు మంచి సువాసనతో..పరిమళభరితంగా ఉండాలని మహిళలు కోరుకుంటూ ఉంటుంటారు. కానీ ఇంట్లో వాతావరణం సరిగ్గా లేకపోవడం..వస్తువులన్నీ ఎక్కడ పడితే అక్కడ పడేయడం వల్ల దుర్వాసన వెదజల్లుతుంటుంది. సువాసగా ఉండేందుకు మార్కెట్లో దొరికే వస్తువులను వాడుతుంటారు. కానీ రసాయనాలతో కాకుండా కొన్ని పాటిస్తే పరిమళభరితం అవుతుంది. 
మసాలాలు కావచ్చు..మాడిన వాసనలు కావచ్చు...వాటితో ఇల్లంతా ఓరకమైన ఘాటు వాసన వస్తుంది కదా. అలాంటి సమయంలో స్ప్రే సీసాలో వెనిగర్‌ని తీసుకుని వంటిల్లూ, ఇతర గదుల్లో చల్లి చూసి తేడాను గమనించండి. 
నాలుగు కర్పూరం బిళ్లల్లో అగరొత్తుల పొడి కలిపి ఇంట్లో లేదంటే స్నానాల గదుల్లో ఉంచి చూడండి. ఈ వాసన అధికంగా ఉండడమే కాకుండా ఈగలు రాకుండా చేస్తుంది. 
వానాకాలంలో ప్రతి ఇంట్లో సాంబ్రాణీ పొగ వేసుకోవడం మంచిది. ఇంట్లో దుర్వాసనలూ, క్రిమికీటకాలతో సహా అన్నీ దూరమవుతాయి. దుస్తులన్నీ ఒకే చోట పోగుపడి ఉండి..దుర్వాసన వెదజల్లుతుంటుంటే నిమ్..లావెండర్ వంటి ఏదైనా పరిమళంలో ఒక జేబు రుమాలను ముంచి దానిని దుస్తుల మధ్య ఉంచండి.
ఒక అర బకెట్ నీళ్లు తీసుకుని అందులో పావుకప్పు వెనిగర్, పెద్ద చెంచా నిమ్మరసం కలిపి గదిలో కాస్త చల్లండి..గదిలోని వంట వాసనలు పోయి హాయి వాతావరణంతో నిండిపోతుంది.
కిటికి అద్దాలు దుమ్ము పట్టి ఉంటే కప్పు వెనిగర్ కు చెంచా లావెండర్ ను జోడించాలి. ఓ బట్టను అందులో ముంచి కిటికిలను తుడిస్తే సరిపోతుంది.
కార్పెట్లు మురికిగా ఉంటే కప్పు బేకింగ్ సోడాకు చెంచాడు ఏదైనా సుగంధ నూనెను కలపాలి. ఈ మిశ్రమాన్ని కార్పెట్ పై చల్లి తెల్లారి వాక్యుమ్ క్లీనర్ తో శుభ్రం చేసుకుంటే సరిపోతుంది.

Don't Miss