ఇస్రో మరో మైలురాయి...

06:26 - April 12, 2018

నెల్లూరు : ఇస్రో మరో మైలురాయిని అందుకుంది. దేశీయ దిక్సూచి వ్యవస్థ కోసం ఉద్దేశించిన PSLV-C41 రాకెట్‌ ప్రయోగం విజయవంతమైంది. నెల్లూరులోని శ్రీహరికోట స్పేస్‌ సెంటర్‌ నుంచి ఉదయం 4 గంటల 4 నిమిషాలకు నింగిలోకి దూసుకెళ్లింది. 32 గంటల కౌంట్‌డౌన్‌ అనంతరం షార్‌లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి 19.19 నిమిషాల వ్యవధిలో లక్ష్యాన్ని చేరుకుంది. నాలుగు దశల అనంతరం నిర్ణయించిన సమయానికి విడిపోయి.. కక్ష్యలోకి ప్రవేశించింది. దీని బరువు 1425 కిలోలు. ఈ ఉప గ్రహం ద్వారా దేశ దిక్సూచి వ్యవస్థ అందుబాటులోకి రానుంది. ఇప్పటివరకు ఇస్రో 8 నావిగేషన్‌ శాటిలైట్లను నింగిలోకి పంపింది. తాజాగా రెండు వారాల వ్యవధిలోనే రెండు ప్రయోగాలను నిర్వహించింది. ఇస్రోకు విశ్వాసపాత్రగా నిలిచిన పీఎస్‌ఎల్వీ రాకెట్‌కు ఇది 43వ ప్రయోగం. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

Don't Miss