నిజామాబాద్‌ జిల్లా నవీపేటలో రైతుల రాస్తా రోకో

14:41 - May 19, 2017

నిజామాబాద్: ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు వ్యాపారులు, అధికారులు ముందుకు రాకపోవడంతో కడపుమండిన నిజామాబాద్‌ జిల్లా నవీపేట రైతులు రోడ్డెక్కారు. రోడ్డపై బైఠాయించి రాస్తారోకో చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అధికారులు, వ్యాపారుల నిర్లక్ష్యంతో ఎండబెట్టిన ధాన్యం వర్షానికి నష్టపోవాల్సి వస్తోందని అన్నదాతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

Don't Miss