'వివో' మొబైల్ డీలర్ నిర్వాకం చూడండి...

14:42 - January 13, 2018

నెల్లూరు : వారందరూ ఉన్నతంగా చదువుకున్న వారే...కానీ ఎంత చదువుకున్నా ప్రస్తుత తరుణంలో ఉద్యోగాలు రావడం లేదు. దీనితో ఎదో చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ బతికేస్తున్న వారు చాలా మందే ఉన్నారు. వారు పనిచేస్తున్న కంపెనీలు..సంస్థలు పెడుతున్న బాధలు భరిస్తూ వారు ఉద్యోగాలు చేస్తున్నారు. తాజాగా ఉద్యోగులపై 'వివో' మొబైల్ కంపెనీ డీలర్ చేస్తున్న అరాచకం బయటపడింది. టార్గెట్ పూర్తి చేయని వారికి వేతనాలు ఇవ్వకుండా..కఠినమైన శిక్షలు విధిస్తున్నాడు.

నెల్లూరులో 'వివో' మొబైల్ షాపును చైనా కంపెనీ క్రిస్క్ నిర్వహిస్తోంది. ఇందులో నెల్లూరు, కడప జిల్లాకు చెందిన వంద మందికి దాక పని చేస్తున్నారు. వీరందరూ బీటీక్, ఏంబీఏ, డిగ్రీ పూర్తి చేసిన వారు. వారి వారి అర్హతలను బట్టి రూ. 9వేల నుండి 15వేల వేతనాలు ఇస్తామని చెప్పి ఉద్యోగంలోకి యాజమాన్యం నియమించుకుంది. అందులో కొన్ని కండీషన్ పెట్టింది. ప్రతి నెలా టార్గెట్ ఇవ్వడం చేస్తోంది. నెలకు 50-100 మొబైల్స్ విక్రయించాల్సి ఉంటుందని..టార్గెట్ పూర్తి చేయకపోతే వేతనాలు ఇవ్వకపోవడమే కాకుండా కఠిన శిక్షలు విధిస్తుండడం సంచలనం సృష్టిస్తోంది. గుంజీలు తీయించడం..డిప్స్ తీయించడం..వంటివి యాజమాన్యం చేస్తోంది. వీరి శిక్షలు వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇంత జరుగుతున్నా పోలీసులు..కార్మిక అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరి ప్రస్తుతం దర్శనమిచ్చిన ఈ వీడియోలపై ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి. 

Don't Miss