'నేను శైలజ' కాంబినేషన్ మళ్ళీ రిపీట్..

12:20 - May 16, 2017

కొన్ని సార్లు ఫిలిం ఇండస్ట్రీ లో హిట్ కాంబినేషన్స్ మంచి ఇంటరెస్ట్ ని జెనరేట్ చేస్తాయి. ఆల్రెడీ ఒక సినిమాతో హిట్ కొట్టిన డైరెక్టర్ కొంచం గ్యాప్ తీస్కొని మళ్ళీ అదే హీరో తో సినిమా ఒకే చేసుకున్నాడు. లవ్ సబ్జెక్టు ని ఫ్యామిలీ వాల్యూస్ తో స్క్రీన్ మీద పండించిన ఈ డైరెక్టర్ ఎవరు ? అతను రిపీట్ చెయ్యబోయే హీరో ఎవరు ? ప్రెసెంట్ జెనరేషన్ లో లవ్ ఎలా ఉంది, అమ్మాయిలు అబ్బాయిల దగ్గర నుండి ఏమి కోరుకుంటున్నారు, అబ్బాయిలు ఎలా బెహేవ్ చేస్తున్నారు అనే ట్రెండీ కాన్సెప్ట్ తో వచ్చిన సినిమా 'సెకండ్ హ్యాండ్'. ఈ 'సెకండ్ హ్యాండ్' అనే టైటిల్ తో సినిమా తీసి తెలుగు తెరకి పరిచయం అయిన డైరెక్టర్ కిషోర్ తిరుమల. యూత్ కి కనెక్ట్ అయ్యేలా లవ్ స్టోరీ ని ప్రెసెంట్ చేసి ఇంప్రెస్స్ చేసాడు కిషోర్. ఈ సినిమా తరువాత చాలా గ్యాప్ తీసుకుని లాస్ట్ ఇయర్ మరో పెద్ద హిట్ ఇచ్చాడు ఈ యంగ్ డైరెక్టర్. హీరో 'రామ్' కెరీర్ లో చాల గ్యాప్ తరువాత వచ్చిన హిట్ ఫిలిం 'నేను శైలజ'. ఈ సినిమా తో లక్కీ హీరోయిన్ 'కీర్తి సురేష్' 'రామ్' తో జత కట్టింది. మంచి సెంటిమెంట్ ని లవ్ ఫీల్ ఎక్కడ మిస్ అవ్వకుండా చూపించిన 'నేను శైలజ' సినిమాని డైరెక్ట్ చేసి 'రామ్' కి హిట్ ఇచ్చిన డైరెక్టర్ కిషోర్ తిరుమల. ఈ సినిమా తరువాత హిట్ ట్రాక్ లో పడ్డ కిషోర్ కి మాత్రం నెక్స్ట్ ఛాన్స్ రావడానికి మళ్ళీ టైం పట్టింది. 'నేను శైలజ' చిత్రంతో బ్లాక్‌బస్టర్‌ సాధించిన కిషోర్‌ తిరుమల మలి చిత్రాన్ని 'వెంకటేష్‌'తో చేయాల్సి వుంది. 'ఆడాళ్లూ మీకు జోహార్లు' అనే సినిమా అనౌన్స్‌ అయింది, ఆరుగురు హీరోయిన్లుంటారని వార్తలు వచ్చాయి. కానీ 'వెంకీ' ఆ చిత్రం చేయడానికి ఆసక్తి చూపించకపోవడంతో కిషోర్‌ వేరే హీరోల దగ్గరకి వెళ్లాడు. 'నితిన్' తో కూడా సినిమా అనుకుని మళ్ళీ డ్రాప్ అయ్యేడు కిషోర్ . మరి వాట్ నెక్స్ట్ ..??

మరో సినిమా..
ఇప్పుడు హాట్ న్యూస్ గా తిరుమల కిషోర్, రామ్ కలిసి మరో సినిమా చెయ్యబోతున్నారు. 'నేను శైలజ' కాంబినేషన్ మళ్ళీ రిపీట్ అవ్వబోతుంది. ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం షూటింగ్ ఇటీవల వైజాగ్ లో జరిగింది. కృష్ణచైతన్య సమర్పణలో స్రవంతి మూవీస్, పి.ఆర్‌. సినిమాస్‌ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాయి. 'నేను శైలజ' ఫేమ్‌ కిశోర్‌ తిరుమల దర్శకత్వంలో 'స్రవంతి' రవికిశోర్‌ నిర్మిస్తున్న ఈ చిత్రంలో 'అనుపమా పరమేశ్వరన్', మేఘా ఆకాశ్‌ కథానాయికలు. మే 15న సోమవారం రామ్ పుట్టినరోజు సందర్భంగా చిత్ర యూనిట్ రామ్ కు శుభాకాంక్షలు తెలియజేస్తూ చిత్రానికి సంబంధించిన డీటైల్స్ ను వెల్లడించారు.

Don't Miss