మెగా ఫ్యామిలీ నుండి మరో 'హీరో'..

14:39 - June 28, 2018

మెగా ఫ్యామిలీ నుండి ఎంతమంది హీరోలు వచ్చినా..చిరంజీవి మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ను చూడగానే చిరంజీవి ఠక్కున గుర్తుకొస్తారు. చిరంజీవి కొడుకు చరణ్ కు పెద్దగా పోలికలు లేకపోవయినా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కు మాత్రం మేనమామ పోలికలు వచ్చాయి. అతని బ్యాడీ లాంగ్వేజ్ కూడా చిరంజీవిని తలపించేలా వుంటుంది. పోలికలు కూడా కలిసి రావటంతో సాయి మాస్ ఆడియన్స్ ను బాగా మెప్పిస్తున్నాడు. తేజ్, మాస్ ఆడియన్స్ నుంచి మంచి మార్కులు కొట్టేస్తూ వచ్చాడు. చిరంజీవి స్టైల్ ను అనుకరిస్తూ .. ఆయన హిట్ సాంగ్స్ ను రీమిక్స్ చేస్తూ మెగా అభిమానుల దృష్టిని తన వైపుకు తిప్పుకోవడంలో సక్సెస్ అయ్యాడు. కానీ తేజ్ సినిమాలు పెద్దగా హిట్ అవ్వకపోయినా త్వరలో సరైన హిట్ కొట్టాలనే పట్టుదలతో వున్నాడు.

హీరోగా ఎంట్రీ ఇవ్వనున్న తేజ్ తమ్ముడు వైష్టవ్ తేజ్..
ఈ నేపథ్యంలో హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి ఆయన తమ్ముడు వైష్ణవ్ తేజ్ రెడీ అవుతున్నాడు. నటన పట్ల ఆసక్తి కలగడంతో ఇతర మెగా హీరోల సలహాలను .. సూచనలను వైష్ణవ తేజ్ తీసుకున్నాడట. ఆ ప్రకారం ఒక వైపున చదువును పూర్తి చేస్తూనే, మరో వైపు నటన,డాన్స్,ఫైట్స్ విషయంలో ట్రైనింగ్ తీసుకున్నట్లుగా సిని పరిశ్రమ సమాచారం. ఈ క్రమంలో ఎంట్రీకోసం కథలు వింటూ వస్తోన్న వైష్ణవ్ తేజ్ కి, దర్శకుడు సాగర్ కె. చంద్ర వినిపించిన కథ తెగ నచ్చేసిందట. దాంతో వెంటనే వైష్ణవ్ తేజ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్టుగా చెబుతున్నారు. రామ్ తాళ్లూరి నిర్మాణంలో త్వరలోనే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కనుందని తెలుస్తోంది. 

Don't Miss