నయా ట్రెండ్..బతికిఉండగానే విగ్రహాలు..

12:09 - May 17, 2017

ప్రస్తుతం సినిమా ప్రపంచంలో కొత్త ట్రెండ్ మొదలైంది. తమ అభిమాను నటులకు అభిమానులకు విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రముఖులు బతికి ఉండగానే విగ్రహాలు ఏర్పాటు చేసే ట్రెండ్ కొనసాగుతోంది. మొన్న దర్శకుడు పూరీ జగన్నాథ్ విగ్రహాన్ని..నిన్న లారెన్స్ తన అమ్మ కోసం ఓ గుడిని కట్టించిన సంగతి తెలిసిందే. తాజాగా కలకత్తాలో బిగ్ బి 'అమితాబ్ బచ్చన్' విగ్రహం ఏర్పాటు కావడం చర్చనీయాశంమైంది. అభిమానులు ఓ గుడి కట్టి అందులో 'సర్కార్' విగ్రహాన్ని ఏర్పాటు చేయడం విశేషం. రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో 'సర్కార్ -3' చిత్రంలో అమితాబ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆయన చేసిన సుభాష్ నగ్రే పాత్రలో ఆయన ఎలా ఉన్నారో అలాంటి ప్రతిమనే ఏర్పాటు చేశారు. ఆ పాత్ర వేషధారణలో అభిమానులంతా మాల ధరించి విగ్రహాన్ని ఇటీవలే ఆవిష్కరించారు. ఆరు అడుగుల రెండు అంగుల పొడవు గల ఈ విగ్రహాన్ని ఫైబర్‌ గ్లాస్‌లతో తయారు చేశారు. ఈ ఏడాది అక్టోబర్‌ 11వ తేదీతో అమితాబ్‌ 75 వసంతాలు పూర్తి చేసుకుంటారని ఆ సందర్భంగా ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశామని చెబుతున్నారు.

Don't Miss