ఫీజురీయింబర్స్‌మెంట్‌ పై టీ.సర్కార్ పలాయనవాదం..

07:43 - January 5, 2017

విద్యార్థుల ఫీజురీయింబర్స్‌మెంట్‌ పథకం అమలుపై అసెంబ్లీలో వాడీవేడీ చర్చ జరిగింది. ఈ బకాయిలు పేరుకుపోవడంతో ఇంజినీరింగ్‌ పూర్తి చేసిన వేలాది మంది విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వకుండా విద్యార్థులను వేధిస్తున్న అంశంపై విపక్షాలు ప్రభుత్వంపై విమర్శలు సంధించాయి. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కొనసాగించడంతోపాటు, బకాయిలను కూడా సాధ్యమైనంత తర్వగా విడుదల చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి సమాధానంతో సంతృప్తి చెందని ప్రతిపక్షాలు, వివరణలకు అవకాశం ఇవ్వాలని కోరాయి. కాగా విపక్ష సభ్యుల మాటలు ఏమాత్రం పట్టించుకోని డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి... అసెంబ్లీని గురువారానికి వాయిదా వేశారు. ఉప సభాపతి వైఖరిపై కాంగ్రెస్‌, టీడీపీ సభ్యులు అసెంబ్లీ హాలులో బైఠాయించి నిరనసన వ్యక్తం చేశారు. ఫీజ్ రీయింబర్స్ మెంట్ విషయంలో ప్రభుత్వం పారిపోయిందని విపక్షాలు విమర్శిస్తున్నాయి. ఈ అంశంపై టెన్ టీవీ న్యూస్ మార్నింగ్ లో చర్చనుచేపట్టింది. చర్చలో రాకేశ్ (టీఆర్ఎస్ నేత),జూలకంటి రంగారెడ్డి (సీపీఎం నేత) పాల్గొన్నారు. ఈ అంశంపై మరింతసమాచారానికి ఈ వీడియో చూడండి..

Don't Miss