తెలంగాణ ఎవరిది?...

10:32 - December 21, 2016

మిషన్ భగీరథపై మంగళవారం అసెంబ్లీలో వాడి వేడి చర్చ జరిగింది. ఈ క్రమంలో మంత్రి ఈటెల మాట్లాడే సందర్భంలో 'నా తెలంగాణ' అనడంతో ప్రతిపక్ష నేత జానారెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. 'నా తెలంగాణ కాదు.. మన తెలంగాణ అనాలి' అంటూ హితబోధ చేశారు. జానారెడ్డి వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ ఎదురుదాడి మొదలుపెట్టారు. దీంతో ఇద్దరి మధ్య కాసేపు వాదన జరిగింది. ఉద్యమం తీవ్రస్థాయికి వెళ్లిన నేపథ్యంలో విధిలేని పరిస్థితుల్లోనే కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చిందే తప్ప మరేమీకాదని..తెలంగాణ ప్రజలు గుర్తించారు కాబట్టే మిమ్మల్ని ప్రతిపక్షంలోనూ మమ్మల్ని అధికారంలోనూ కూర్చోబెట్టారని తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ ఎదురుదాడికి దిగారు. దీనిపై జానారెడ్డి ఉద్వేగానికి లోనయ్యారు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించటంలో కాంగ్రెస్ పాత్ర కీలకమనీ..ఇది అధికారపక్షం గమనించాలని ఆయన పేర్కొన్నారు. ఈ అంశంపై టెన్ టీవీ న్యూస్ మార్నింగ్ లో చర్చను చేపట్టింది. ఈ చర్చలో తాడూరి శ్రీనివాస్ (టీఆర్ఎస్ నేత),దుర్గాప్రసాద్ (టీ.టీడీపీ నేత), నడిపల్లి సీతారామరాజు (ప్రముఖ విశ్లేషకులు) పాల్గొన్నారు. ఈ అంశంపై మరింత సమాచారం కోసం ఈ వీడియోను చూడండి..

Don't Miss