మోదీకి ముడుపులు..రాహుల్ ఆరోపణలు..

09:46 - December 22, 2016

కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఎప్పటి నుండో ఓ మాట చెప్తానంటూ ఊరిస్తున్నాడు..నేను ఆ మాట చెప్తే భూకంపం  వస్తుందనీ..సంచలనమైపోతుందంటూ ఊదరగొట్టాడు..ఎట్టకేలకూ తను బాంబు అనుకుంటున్న ఆ మాటను బైటపెట్టాడు..అదే ప్రధాని నరేంద్రమోదీ వ్యక్తిగత అవినీతి చిట్టా బైటపెడితే ఆయనకు ఇబ్బంది కలుగుతుందనీ అన్నమాటలు.. నరేంద్ర మోదీ గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సహారా, బిర్లా గ్రూపుల నుంచి భారీగా ముడుపులు తీసుకున్నారని ఆరోపించారు. అక్టోబర్‌ 2013 ఫిబ్రవరి 2014 మధ్య 9 వాయిదాలలో సహారా గ్రూపు 40 కోట్లు మోదికి ఇచ్చినట్లు ఐటీ రికార్డుల్లో ఆధారాలున్నాయని ఆరోపించారు. బిర్లా గ్రూపు మోదికి 12 కోట్లు ఇచ్చారని ఆరోపించారు. మోదికి ఇచ్చినట్లు ఐటీ రికార్డుల్లో ఆధారాలున్నాయని మోది సొంత రాష్ట్రం గుజరాత్‌లోని మహసాణాలో జరిగిన సభలో రాహుల్‌ మోదీపై ఆరోపణలు గుప్పించారు. ఈ అంశంపై టెన్ టీవీ న్యూస్ మార్నింగ్ లో చర్చను చేపట్టింది. ఈ చర్చలో శ్రీనివాస్ (బీజేపీ నేత) పున్నం కైలాష్ (కాంగ్రెస్ నేత) లక్ష్మణరావు ( విశ్లేషకులు, మాజీ ఎమ్మెల్సీ) పాల్గొన్నారు. 

Don't Miss