హీరోకి గుండె కుడివైపున ఉంటుంది - నిఖిల్...

10:24 - January 23, 2017

డిఫరెంట్ మూవీస్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న 'నిఖిల్' మరో డిఫరెంట్ మూవీతో రెడీగా ఉన్నాడు. 'కేశవ' టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ వావ్ అనిపిస్తోంది. ఈ న్యూమూవీకి సంబంధించిన స్టోరీని ముందే రివీల్ చేసి సినిమాపై హైప్ పెంచుతున్నాడు. కంటెంట్ ఓరియెంటెడ్ మూవీస్ హీరోగా 'నిఖిల్' కి ఇండస్ట్రీలో మంచి పేరుంది. ఒక్క 'శంకరాభరణం' తప్ప 'నిఖిల్' ఈ మధ్య కాలంలో చేసిన ఏ మూవీ కూడా ఆడియన్స్ ని నిరాశపరిచలేదు. గత ఎడాది రిలీజైన 'ఎక్కడికిపోతావు చిన్నవాడా' సినిమా అయితే ఓల్ ఇండస్ట్రీకి స్వీట్ షాక్ ఇచ్చింది. డిమానిటైజైషన్ లో సైతం ఈ మూవీ 40కోట్లకు పైగా కలెక్ట్ చేసి అందరిని మెస్మరైజ్ చేసింది. ఇప్పుడు ఈ సినిమా మించిన డిఫరెంట్ కంటెంట్ తో మరో హిట్టు కోసం 'నిఖిల్' రెడీ అవుతున్నాడు.

ఫస్ట్ లుక్..
కుర్రహీరో 'నిఖిల్' నటించిన కొత్త మూవీ 'కేశవ' ఫస్ట్ లుక్ అదిరిపోయింది. ఈ మూవీ లుక్స్ చూస్తుంటే యాక్షన్ ఎంటర్టెయినర్ అనే విషయం అర్ధమవుతోంది. అయితే పగ అనే వంటకాన్ని చల్లగా ఉన్నప్పుడు వడ్డిస్తే కిక్కే వేరు అంటూ బోల్డ్ లెటర్స్ లో వేసిన ట్యాగ్ లైన్ లోనే మూవీ స్టోరీ దాగుందని నిఖిల్ చెప్పుతున్నాడు. ఈ ట్యాగ్ లైన్ కి సంబంధించి అసలు ఈ యంగ్ హీరో టోటల్ స్టోరీ మొత్తం చెప్పేసి సినిమాపై హైప్ క్రియేట్ చేసేశాడు. 'కేశవ' మూవీలో 'నిఖిల్' గుండె జబ్బుతో బాధపడే క్యారెక్టర్ లో కనిపిస్తాడట. అంతేకాదు అందరిలా కాకుండా ఈ సినిమాలో హీరోకి గుండె కుడివైపున ఉంటుందని 'నిఖిల్' షాకింగ్ విషయం చెప్పాడు. ఇలా కుడి వైపు గుండె ఉన్న వ్యక్తి ఎట్టి పరిస్థితుల్లోనూ కోపం తెచ్చుకోకూడదట, టెన్షన్ ఫీల్ అవకూడదు.

ఫైట్స్ కంపోజ్ చేసిన నిఖిల్..
ఏ మాత్రం ఎమోషన్ అయిన కోపం తెచ్చుకున్న దాని ఎఫెక్ట్ ఫిజికల్ గా చూపిస్తుందట. ఇలా అరుదైన జబ్బుతో బాధపడే హీరో ఓ ఆపరేషన్ మిషన్ లో పాల్గొంటాడట. తన ఎనీమిస్ పై పగ తీర్చుకోవడానికి కోపం తెచ్చుకోకుండానే ఆ మిషన్ ఎలా కంప్లీట్ చేశాడనేదే 'కేశవ' సినిమా స్టోరీ అని 'నిఖిల్' ఈ న్యూమూవీ స్టోరీ మొత్తం రివీల్ చేశాడు. ఈ చిత్రం ఈ యంగ్ హీరో లుక్స్ పరంగా కూడా మేకోవర్ చూపిస్తున్నాడు. అంతేకాదు ఈ మూవీలోని ఫైట్స్ ని స్వయంగా 'నిఖిలే' కంపోజ్ చేశాడట. స్టోరీ వింటుంటేనే థ్ర్లిల్లింగ్ అనిపిస్తున్న ఈ మూవీ 'నిఖిల్' కెరీర్ లో మరో సూపర్ హిట్టుగా నిలిచినట్లే అనిపిస్తోంది.

Don't Miss